చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్ బలాలు బలహీనతలు: ధోనీ దమ్మేంటో చూపిస్తాడా..?

|
Google Oneindia TeluguNews

ధనాధన్ క్రికెట్‌ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31వ తేదీ నుంచి అహ్మదాబాద్ వేదికగా తొలి ఐపీఎల్ (IPL)మ్యాచ్‌ జరుగనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌ ధోనీనే సగం బలం.

అయితే తొలిసారిగా టోర్నీలో అడుగుపెట్టి కప్ ఎగురేసుకుపోయింది గుజరాత్ టైటాన్స్ జట్టు. ఇక తొలి మ్యాచ్ కచ్చితంగా హోరాహోరీగా సాగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ బలబలాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఈ సారి ధోనీ నాయకత్వంలో...

2022 ఐపీఎల్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపక్ కింగ్స్ నిరాశ పర్చింది. నాలుగు సార్లు టైటిల్ కొట్టిన ధోనీ సేన గతేడాది మాత్రం 9వ స్థానంలో నిలిచి ఇటు తమిళ తంబీలను అటు ధోనీ ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది.రవీంద్ర జడేజా కెప్టెన్‌గా గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీలో అడుగుపెట్టింది.

అయితే జడేజా పై ఒత్తిడి పెరగడం, తను కూడా ఆటపై దృష్టి సారించలేకపోవడంతో టోర్నమెంట్ మధ్యలోనే కెప్టెన్‌గా వైదొలిగాడు. దీంతో నాయకత్వ బాధ్యతలు తిరిగి ధోనీ చేపట్టాడు. అయితే అప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్..

2023 ఐపీఎల్ సీజన్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కసితో బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా డెవాన్ కాన్వే-రుతురాజ్ గైక్వాడ్ ద్వయం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే అవకాశాలున్నాయి. వన్‌డౌన్‌లో విధ్వంసకారుడు బెన్ స్టోక్స్ ఎలాగు ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో 4వ స్థానంలో మరో స్టార్ ఆటగాడు అంబటి రాయుడు కూడా జట్టుకు అదనపు బలంగా ఉన్నాడు. మిడిల్‌ ఆర్డర్‌ చూస్తే జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. శివమ్ దూబే, మోయీన్ అలీ, రవీంద్ర జడేజా ఆ తర్వాత ధోనీ ఉన్నారు.

IPL 2023:Know the strengths and weakness of Dhoni team Chennai Super kings,will it win the title

బౌలింగ్ డిపార్ట్‌మెంట్..

ఇక బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను పరిశీలిస్తే చెన్నై జట్టు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న దీపక్ చాహర్ జట్టులో చేరాడు.2022లో ముఖేష్ చౌదరీ బంతితో రెచ్చిపోయాడు.ఇక శ్రీలంక బౌలర్ మహీష్ తీక్షణ కూడా తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌లను బోల్తా కొట్టించగల సత్తా ఉన్నవాడు.ఇలా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా చాలా బలంగానే ఉందని చెప్పొచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI:

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్,బెన్ స్టోక్స్,అంబటి రాయుడు, శివం దూబే, మోయీన్ అలీ, ఎంఎస్ ధోనీ(కెప్టెన్) రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ముకేష్ చౌదరీ

English summary
Know the list of Chennai Super kings Playing XI which is a strong team in IPL 2023 under Dhonis captaincy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X