Viral News: ఆర్టీసీ బస్సును ఆపిన రూ.500 నోటు.. ఎలాగంటే..
మనం రూపాయి పోయినా దాని కోసం వెతుకుతుంటాం. అలాంటి ఐదు వందల రూపాయి నోటు పోతే.. అది జరిగింది ఓ చోట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్తోంది. బస్సు ప్రారంభ కాగానే కండక్టర్ టికెట్లు తీసుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బస్సులోని ప్రయాణికులందరికీ టికెట్లు ఇస్తున్నాడు.

బయటకు
బస్సు నడుస్తుండడంతో బయట నుంచి గాలి వేగంగా వస్తోంది. ఇంతలో ఓ ప్రయాణికురాలికి టిక్కెట్ ఇస్తుండగా.. కండక్టర్ చేతిలోంచి రూ.500 నోటు గాల్లోకి ఎగిరిపోయింది. దాన్ని పట్టుకోవడానికి కండక్టర్ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆ నోటు బస్సు కిటికీ నుంచి గాల్లోకి ఎగురుతూ బయటకు కొట్టుకెళ్లింది. దీంతో కండక్టర్ తో పాటు ప్రయాణికురాలు కంగారు పడి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ ఏం జరిగిందో తెలియ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.

8 నిమిషాల పాటు
వెంటనే డ్రైవర్ తో పాటు కొందరు ప్రయాణికులు కూడా కిందకు దిగి నోటు కోసం ఎంకులాడడం మొదలు పెట్టారు. దాదాపు 8 నిమిషాల పాటు రూ.500 నోటు కోసం చెట్ల పొదల్లో వెతికాగా.. చివరకు ఆ రూ.500 నోటు ఓ ప్రయాణికుడికి దొరికింది. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నాడు. వారంతా నవ్వుతూ బస్సు ఎక్కారు. దేవుడి దయతో నా 500 రూపాయలు దొరికాయి అంటూ సదరు ప్రయాణికురాలు సంతోషపడింది.

జోకులు
ఈ ఘటనపై బస్సులో ప్రయాణికులు తలో జోకు వేసుకుంటూ నవ్వుకుంటూ జగిత్యాల వెళ్లారు. నోటు సరిగా పట్టుకోలేదు కాబట్టే గాల్లో ఎగిరిపోయిందని ఒకరు.. లేదు గాలి బాగా వచ్చిందని మరొకరు మాట్లాడుకున్నారు.