ఆనందయ్య మందుపై సంజయ్ హాట్ కామెంట్స్.. మూఢ నమ్మకాలు అని..

ఆనందయ్య ఆయుర్వేద మందుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అందరూ స్వాగతిస్తున్నారు. అన్నీ అనుమతులతో ఎప్పుడెప్పుడూ తీసుకుందామని అనుకుంటున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొందరు మాత్రం అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆనందయ్య గురించి మెడికల్ మాఫియా మాట్లాడుతుందని అనుకున్నాం.. కానీ నేతలు కూడా కామెంట్స్ చేయడం మాత్రం సరికాదు.. అలా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యలు చేశారు. అదీ సర్వత్రా చర్చకు దారితీసింది.

ఆనందయ్య ఆయుర్వేద మందుపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మూఢ నమ్మకాలు నమ్మొద్దని సూచించారు. డాక్టర్లు సూచించిన మందులే వాడాలని చెప్పారు. ఆనందయ్య మందు వాడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరోనాతో జనాలు బతుకుతున్నది డాక్టర్ల మెడిసిన్ వాడటం వల్లేనని సంజయ్ పేర్కొన్నారు. ఆనందయ్య మందు వల్ల జనం బాగుపడితే పాదాభివందనం చేస్తానని ప్రకటించారు. ఆనందయ్య ముందుకు పబ్లిసిటీ ఇవ్వొద్దని సంజయ్ సూచించారు.

mla sanjay sensational comments on anandaiah medicine

అందరూ ఆయుర్వేద మందు వాడాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సంజయ్ చేసిన కామెంట్లు అగ్గి రాజేశాయి. మంచి చేయకపోయినా ఫరవాలేదు.. కానీ ఇలా నోరు పారేసుకోవడం ఏంటీ అని ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి సంజయ్ కుమార్ వైద్యుడు.. ఆయన ఐ స్పెషలిస్ట్.. వైద్య వృత్తిలో ఉండి మరొకరిని చులకన చేయడం సరికాదని అంటున్నారు. ఏంతైనా సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. దీనిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. నెటిజన్లు దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+