ఏపీ రాజకీయాలపై కేటీఆర్: ఒరిజినల్ కాంగ్రెస్‌- జగన్‌కు లింక్

జగిత్యాల్: అధికార భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టారు. తెలంగాణలో ఇప్పుడున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని సెటైర్లు సంధించారు.

ఇవ్వాళ ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటికి వెళ్లారు. అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు ఎకరాల పొలం ఉన్న రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ ఇదివరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

Telangana Minister KTR interesting comments on Andhra politics

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వ్యవసాయం, రైతాంగం పట్ల ఆయనకు ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలతో లక్షలాది మంది రైతులను అవమానించారని చెప్పారు. తమ పాలనలో రైతులను రాజుగా చేశామని, ఇక ముందు కూడా రైతాంగ అనుకూల విధానాలను కొనసాగిస్తామని అన్నారు.

తమ పాలనను మహారాష్ట్ర రైతులు సైతం ప్రశంసిస్తోన్నారని, తమ విధానాలను అక్కడ కూడా అమలు చేయాలనే బలమైన ఆకాంక్షలను వారు వ్యక్తం చేస్తోన్నారని కేటీఆర్ చెప్పారు. రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్నది నకిలీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఒరిజినల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని కేటీఆర్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తోందని ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను ఇచ్చిన మాట వాస్తవం అని కేటీఆర్ చెప్పారు.

అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు లేదని అన్నారు. ఇప్పుడున్నది వైఎస్సార్ కాంగ్రెస్ కాదని, చంద్రబాబు కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. వైఎస్సార్ అనుసరించిన విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఏ మాత్రం లేవని కేటీఆర్ పేర్కొన్నారు. ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఏపీకి తీసుకెళ్లారని- అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మనుగడలో ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+