ప్రొద్దుటూరులో 300 కిలోల బంగారం సీజ్: దసరా వేళ ఇలా జరిగిందేంటి?
కడప: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులకు భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లోబిల్లులు లేని సుమారు 300 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు అధికారులు సీజ్ చేశారు. విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెల్లర్స్, డైమండ్స్ షాపులతోటు గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.
సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టులు, సూట్ కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించి ఈ తనిఖీలు నిర్వహించారు.

బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబైగా పేరు పొందింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో రెండు వేలకుపైగా బంగారం, స్వర్ణకారుల దుకాణలున్నాయి.
తాజా ఐటీ అధికారుల తనిఖీలతో మిగితా బంగారం దుకాణాల యజమానుల్లో వణుకు మొదలైంది. తనిఖీలు తమ వరకు రావచ్చన్న ఆందోళనతో బంగారం, స్వర్ణకారులు దుకాణాలను మూసివేశారు. దసరా పండగ సమయంలో బంగారం దుకాణాలు మూసి ఉండటంతో కొనుగోలుదారులు దుకాణాల వద్దకు వచ్చి తిరిగి నిరాశగా వెళుతున్నారు.












Click it and Unblock the Notifications