పుట్టిన రోజు నాడు బద్వేలుకు అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వైఎస్ జగన్

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు అధికారులు ఆయనను కలిసి విషెస్ చెబుతున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో సందడిగా మారింది.

సందడిగా తాడేపల్లి..

సందడిగా తాడేపల్లి..

తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు పలికారు. శ్రీవారి శేషవస్త్రాన్ని భుజంపై కప్పారు. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. లడ్డూ ప్రసాదాన్ని అందించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జీ వాణిమోహన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి..ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 తణుకులో జగన్

తణుకులో జగన్

అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు బయలుదేరి వెళ్లారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పుట్టినరోజు సందర్భంగా తన సొంత జిల్లా కడపపై వరాలజల్లును కురిపించారు. బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆవిర్భవించిందీ పట్టణం. నాలుగో డివిజన్‌గా బద్వేలు ఏర్పాటైంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

 నాలుగో రెవెన్యూ డివిజన్‌గా..

నాలుగో రెవెన్యూ డివిజన్‌గా..

కడప జిల్లాలో ఇప్పటిదాకా మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. కడప పరిధిలో 18, రాజంపేట-17, జమ్మలమడుగు-16 మండలాలు ఉన్నాయి. కొత్తగా బద్వేలు కూడా ఏర్పాటు కానుంది. బద్వేలు, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, పోరుమామిళ్ల, సిద్ధవటం, శ్రీఅవధూత కాశినాయన, కలసపాడు, బీ కోడూరు, అట్లూరు, గోపవరం వంటి మండలాలను ఈ కొత్త రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చే అవకాశాలు ఉన్నాయి.

రానుపోను 120 కిలోమీటర్లు..

రానుపోను 120 కిలోమీటర్లు..


ప్రస్తుతం బద్వేలు.. కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. పనుల నిమిత్తం వెళ్లదలిచిన వారు రానుపోను 120 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా మార్చాలనే డిమాండ్ కూడా ఉంది. దీనికి అనుగుణంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ డివిజన్‌గా బదలాయించింది. ఉత్తర్వులను జారీ చేసింది. ఇంత భారీ మెజారిటీని అందించిన బద్వేలుకు వైఎస్ జగన్.. తన పుట్టినరోజు నాడు అనూహ్య బహుమతి ఇచ్చారు.

అత్యధిక మెజారిటీ..

అత్యధిక మెజారిటీ..


బద్వేలు.. వైఎస్ జగన్‌కు అత్యధిక మెజారిటీ ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో నిర్వహించిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ సుధ.. 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించారు. ఈ మెజారిటీ- పులివెందులలో వైఎస్ జగన్‌కు వచ్చిన దాని కంటే అధికం. ఈ ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లలేదు ముఖ్యమంత్రి. పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ బద్వేలు నియోజకవర్గం ఓటర్లకు లేఖ మాత్రమే రాశారు.

ప్రచారానికి రాకపోయినా..

ప్రచారానికి రాకపోయినా..

ప్రచారానికి రాకపోయినప్పటికీ.. వైఎస్ జగన్‌పై నమ్మకాన్ని ఉంచారు బద్వేలు ఓటర్లు తిరుగులేని మెజారిటీతో డాక్టర్ సుధను గెలిపించారు. అసెంబ్లీకి పంపించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఎన్నిక బరిలో నిలిచాయి. ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 21 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+