తెలిసాక.. మళ్లీ విచారించడం ఎందుకో.. వివేకా హత్య కేసుపై బీటెక్ రవి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలకదశకు చేరుకుంది. హత్య కేసులో రోజుకో సంచలన వాంగ్మూలం నమోదవుతుంది. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని వెల్లడించారు. పూర్తి విషయాలు బహిర్గతం అయ్యాక కూడా టీడీపీ నేతలను ఎందుకు ప్రశ్నిస్తున్నారని కామెంట్ చేశారు.

నింద ఆపాదించడం..
సీబీఐ విచారించాక కూడా ఆ నిందను టీడీపీకి ఆపాదించడం ఏమిటని మండిపడ్డారు. వివేకా హత్య కేసును చంద్రబాబుకు చుట్టడం సరికాదని స్పష్టం చేశారు. సీబీఐకి వైఎస్ కుటుంబంపై ఏమైనా కక్ష ఉంటుందా? అని బీటెక్ రవి ప్రశ్నించారు. వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐకి తెలుసని వెల్లడించారు. వివేకాను హత్య చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేనందునే విచారణకు పిలవలేదు అని వివరించారు.

మరికొందరినీ..
వివేకానంద హత్య కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మరికొందరు ప్రముఖులను అరెస్ట్ చేయాల్సి ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఇటు వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ ఉండొచ్చంటూ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం తెలిసిందే. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివేకా కుమార్తె సునీత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతిలో పావుగా మారారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నుంచి రియాక్షన్స్ ప్రారంభం అయ్యాయి.

పావు అయ్యారట
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఇవాళ సునీత చంద్రబాబు చేతిలో పావు అన్నాడని పేర్కొన్నారు. మరి రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులేనని అంటాడని సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు. సజ్జల లాంటి నీచ క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సజ్జల కామెంట్ల తాలూకు వీడియోను ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications