కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలిసారి తాత పేరు: కడప స్టేడియానికి అంతర్జాతీయ హోదా: సీమ ముంగిట్లో డే/నైట్ మ్యాచ్‌లు

|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలో తొలిసారిగా ఏర్పాటైన క్రికెట్ స్టేడియానికి ఇక అంతర్జాతీయ హోదా దక్కబోతోంది. ఈ స్టేడియంలో వన్డే ఇంటర్నేషనల్స్ నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు చేసే అవకాశాలు లేకపోలేదు. డే/నైట్ మ్యాచ్‌లను నిర్వహించడానికి వీలుగా.. ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఆ సౌకర్యం కడప స్టేడియానికి లేదు. తాజాగా- ఆ కొరతను తీర్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకాస్సేపట్లో ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు- కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.

కడప శివార్లలోని పుట్లంపల్లి వద్ద నిర్మించిన స్టేడియం ఇది. సుమారు 80 ఎకరాల్లో ఇది నిర్మితమైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో దాని నిర్మాణం పూర్తయింది.

CM YS Jagan to inaugurates development works at YS Raja Reddy cricket stadium at Kadapa

తరచూ దేశవాళీ మ్యాచ్‌లను బీసీసీఐ అక్కడ నిర్వహిస్తోంది. దీని నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధీనంలో ఉంటోొంది. ఈ స్టేడియానికి వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి పేరు మీద దీన్ని నెలకొల్పారు. మనవడు వైఎస్ జగన్ హయాంలో ఈ స్టేడియం అంతర్జాతీయ కళను సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

తన రెండు రోజుల పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. ఈ సాయంత్రం కడపకు రానున్నారు. ప్రస్తుతం ఆయన బద్వేలులో పర్యటిస్తోన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ వెంటనే ఆయన కడపకు బయలుదేరి వస్తారు. నేరుగా పుట్లంపల్లి వద్ద నిర్మించిన స్టేడియానికి చేరుకుని, ఫ్లడ్ లైట్ల నిర్మాణం, కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

CM YS Jagan to inaugurates development works at YS Raja Reddy cricket stadium at Kadapa

Recommended Video

Andhra Pradesh : కడపలో ఆసుపత్రి, పుంగనూరులో బస్‌డిపో ప్రారంభించిన జగన్!!

ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత వైఎస్ జగన్ కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ఈ స్టేడియానికి సంబంధించిన డ్రోన్ షాట్లను జిల్లా అధికార యంత్రాంగం కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy to inaugurates development works at YS Raja Reddy cricket stadium at Kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X