ఏపీ గ్రాండ్ కెన్యన్‌లో స్టార్ హోటల్- జగన్ శంకుస్థాపన
కడప: గండికోట.. గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పేరున్న చారిత్రాత్మక ప్రదేశం. ఏపీలోని ప్రఖ్యాత పర్యాటక స్థలాల్లో ఒకటి. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో.. పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. సుమారు 300 అడుగుల ఎత్తున ఉండే కొండలను చీల్చుకుంటూ పెన్ననది ప్రవహిస్తుంటుంది. అందుకే దీనికి గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
ఇక్కడ ఓ స్టార్ హోటల్ నిర్మితం కానుంది. ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్.. దీన్ని నిర్మించబోతోంది. విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ సంస్థ ఈ హోటల్‌ను నిర్మించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. దీనితో పాటు విశాఖపట్నం జిల్లా అన్నవరం వద్ద మరో హోటల్‌ను కూడా నిర్మించనుంది. దీనికోసం 350 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది.

ప్రస్తుతం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇవ్వాళ ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి వెళ్లారు. అనంతరం కడప జిల్లా ఇడుపుల పాయకు చేరుకున్నారు. తండ్రి సమాధికి నివాళి అర్పించారు. రాత్రి ఇడుపుల పాయలోనే ఆయన బస చేశారు. ఆదివారం ఉదయం గండికోటకు బయలుదేరి వెళ్తారు. 9:20 నిమిషాలకు అక్కడికి చేరుకుంటారు.
9:30 గంటలకు ఒబెరాయ్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు జగన్. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత 11:05 నిమిషాలకు పులివెందుల కొత్త మున్సిపల్ కార్యాలయ భవనం వద్దకు వస్తారు. మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాణితోపు వద్ద పులివెందుల సిటీ ఫారెస్ట్‌ను జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు.
జగన్ పర్యటన సందర్భంగా గండికోటను ఇప్పటికే జిల్లా అధికారులు పరిశీలించారు. కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ గణేశ్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ అధికారులు గండికోటలో జగన్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గండికోటలో కట్టుదిట్టమైన భధ్రతను ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications