ycp jagan ys jagan ysrcp andhra pradesh Pulivendula kadapa amaravati padayatra bus tour 2019 elections వైసిపి
జగన్ సమరనాదం : బస్సు యాత్రకు ముమూర్తం ఫిక్స్ : ఇక..ఏపి నడిబొడ్డు నుండే..!

వైసిపి అధినేత జగన్ ఎన్నికల సమరశంకం పూరిస్తున్నారు. ఇచ్ఛాపురం వేదికగా పాదయాత్ర ముగింపు సభలో జగన్ 2019 ఎన్నిలకు సమరనాదం మోగించనున్నారు. పాదయాత్ర ముగింపుతో రెస్ట్ తీసుకోనని..ఎన్నికల రణరంగంలోకి అసలైన కార్యాచరణ తో దిగుతారని చెబుతున్నారు. దీనిలో భాగంగా..ఢిల్లీలో హోదా నిరసనలు..బస్సు యాత్ర తో పాటుగా అభ్యర్ధుల ప్రకటనకు జగన్ రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ముగింపు కాదిది..ఆరంభం..
దాదాపు 14 నెలల పాటు సాగిన జగన్ పాదయాత్ర 9వ తేదీన ఇచ్ఛాపురం లో ముగియనుంది. అయితే, పాదయాత్ర తో రెస్ట్ తీసుకోవాలనుకోవటం లేదని..అసలు కధ మొదలవుతుందని వైసిపి నేతలు చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పాదయాత్ర ముగింపు సభ ద్వారా జగన్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఈ సభ ద్వారానే జగన్ తన ఎన్నికల కార్యాచరణ ను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇక, పాదయాత్ర సభా వేదికగా..ఏపికి ప్రత్యేక హో దా కోసం చేపట్టనున్న కార్యాచరణ ను వెల్లడించనున్నారు. దీంతో పాటుగా..2019 ఎన్నకలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. టిక్కెట్ల ఖరారు పై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన జగన్..దశల వారీగా పార్టీ అభ్యర్ధులను ప్రకటించనున్నారు. అందులో భాగంగా..తొలి లిస్టు ఇచ్ఛాపురం వేదికగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఇచ్చాపురం లో పాదయాత్ర ముగింపు వేదికే..ఎన్నికల సమరానికి ప్రారంభ వేదిక గా మారుతుందని వైసిపి సీనియర్లు చెప్పుకొస్తున్నారు.
జగన్ పై పోటీకి సై : పులివెందుల బరిలో ఆయనే..!

విరామం లేదు..బస్సు యాత్రకు ముహూర్తం ఖరారు..
ఇచ్ఛాపురం వేదికగా పాదయాత్ర ముగిసిన వెంటనే జగన్ అక్కడి నుండి నేరుగా తిరుపతి వెళ్తారు. తిరుపతి నుండి కాలినడకన కొండ పైకి చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జెరూసెలం వెళ్లనున్నారు. ఇక, వచ్చిన తరువాత వరుసగా జిల్లాల సమీక్షలు నిర్వహించి..ఎన్నికల కార్యాచర ణ ఖరారు చేస్తారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ తేదీ నుండి జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. దాదాపు ఏపిలోని 45 నుండి 50 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది.
సాధ్యమైనంత త్వరగా బస్సు యాత్ర పూర్తి చేసి ఆ వెంటనే ఇక ఎన్నికల ప్రచారంలోకి దిగాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే, జగన్ బస్సు యాత్ర ఎక్కడి నుండి ప్రారంభించాలి..ఎక్కడ ముగించాలనే దాని పై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉండటంతో.. వ్యూహాత్మ కంగా ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు అమలు చేయాలని భావిస్తున్నారు.

అభ్యర్ధుల ప్రకటన ఇలా.. విజయవాడ కేంద్రంగా..
ఇప్పటి వరకు పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉన్న జగన్..తయ విదేశీ పర్యటన ముగిసిన తరువాత ఇక విజయవాడ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో పార్టీ కార్యాలయం తో పాటుగా ఇంటి నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా గృహ ప్రవేశం చేసి బస్సు యాత్ర పూర్తయిన వెం టనే అక్కడి నుండి ఎన్నికల సమరానికి సిద్దం కావాలని నిర్ణయించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రకటన పైనా జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బస్సు యాత్ర పూర్తవుతూనే అభ్యర్ధులను పూర్తి స్థాయిలో ప్రకటిస్తే వారికి ప్రచారంతో పాటుగా..అభ్యర్ధుల ప్రకటన ద్వారా ఎదురయ్యే అసంతృప్తులు.. ఇతర సమస్య లను పరిష్కరించుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగానే ఇతర పార్టీల నుండి వచ్చే చేరికలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో..జగన్ పాదయాత్ర ముగిసిన తరువాత అసలు ఎన్నికల రాజకీయం వైసిపి లో ప్రారంభం అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.