కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ సొంత జిల్లా నుంచి ఐపీఎల్‌కు చిచ్చరపిడుగు: వేలంపాటలో మారంరెడ్డికి ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోబోతోన్నాడో యంగ్ క్రికెటర్. ఆయన పేరు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వయస్సు 22 సంవత్సరాలు. స్వస్థలం రాయచోటి. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఆయనకు ఛాన్స్‌ లభించింది. 1,114 మంది వేర్వేరు దేశాలు టీమ్‌లకు చెందిన క్రికెటర్లు పోటీ పడగా.. 292 మందికి మాత్రమే ఇందులో అవకాశం లభించింది. ఆ 292 మంది క్రికెటర్లలో మారంరెడ్డి ఉన్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జోగి రమేష్: ఏపీ హైకోర్టులో పిటీషన్నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జోగి రమేష్: ఏపీ హైకోర్టులో పిటీషన్

ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం వేలంపాట ఈ నెల 18వ తేదీన చెన్నైలో ఆరంభం కాబోతోంది. ఈ ఐపీఎల్ మినీ వేలంపాటలో మారంరెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండుల్కర్ ఈ లిస్ట్‌లో ఉన్నాడు. వారి బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలు. అరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, జేసన్ రాయ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హర్భజన్ సింగ్, మార్ముస్ లాంబుషేన్ వంటి హేమాహేమీలతో కలిసి ఐపీఎల్ 2021 ఆక్షన్‌లో పాల్గొనే క్రికటర్ల లిస్ట్‌లో మారంరెడ్డికి చోటు లభించింది.

IPL 2021: Harishankar Reddy Native of Kadapa finds place in auction

ఆంధ్రా క్రికెటర్ జట్టుకు ఆయన ప్రస్తుతం ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2018 జనవరి 11వ తేదీన ఆంధ్రా-కేరళ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో క్రికెట్‌లో అడుగు పెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన ఆయన 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను తీశాడు. ఇప్పటిదాకా 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కిందటి నెల 15వ తేదీన ముంబైలో పుదుచ్చేరి టీమ్ మీద 35 పరుగులకు మూడు వికెట్లను తీసుకున్నాడు. నిలకడగా రాణిస్తుండటంతో ఆయనకు ఐపీఎల్‌ 2021 ఆక్షన్‌లో ఎంట్రీ లభించింది.

ఇదివరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్.. ఐపీఎల్ ఆడాడు. దక్కన్ ఛార్జర్స్ ఫ్రాంఛైజీకి ఆయన ప్రాతినిథ్యాన్ని వహించారు. 2007లో జరిగిన కోల్‌కత ఈడెన్ గార్డెన్‌లో బెంగాల్ టీమ్‌తో జరిగిన రంజీమ్యాచ్‌లో 10 వికెట్లను పడగొట్టిన అరుదైన రికార్డ్ విజయ్ కుమార్‌కు ఉంది. తాజాగా- మారంరెడ్డి హరిశంకర్ రెడ్డికి ఐపీఎల్ వేలంపాటలో ఎంట్రీ లభించింది. వర్ధమాన క్రికెటర్లకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాన్ని కల్పించే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ అతన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉంది.

English summary
Maramreddy Harishankar Reddy, a young cricketer native of Rayachoti in Kadapa district of Andhra Pradesh, finds place in IPL 2021 auction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X