కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిని సీమలో ఏర్పాటు చేయండి: వైసీపీకి పట్టం కట్టారు: హైపవర్ కమిటీకి సీమ నేతల లేఖ..!

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల ప్రతిపాదన..విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు పైన రాయలసీమ నేతలు మరో లేఖ రాసారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా జీఎన్ రావు ..బోస్టన్ కమిటీలు నివేదికలు సమర్పించాయివ. ఈ రెండు కమిటీ నివేదికల అధ్యయనం..సిఫార్సుల కోసం ప్రభుత్వం మంత్రులు..అధికారులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ రోజు తొలి సమావేశం జరుగుతోంది. దీంతో..కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రికి లేఖ రాసిని రాయలసీమ ప్రాంత నేతలు..అధికారులు ఇప్పుడు మరోసారి సీఎంతో సహా హైపవర్ కమిటీకి లేఖ రాసారు. అందులో గ్రేటర్ రాయలసీమ వాసుల సెంటిమెంట్ ను గుర్తించి రాజధానిని రాయలసీమకు కేటాయించాలని డిమాండ్ చేసారు. సీమ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ..గతంలో చేసిన త్యాగాలను ప్రస్తావించారు.

రాజధానిని కదిలిస్తే రాష్ట్రం అగ్నిగుండమే: కమిటీకి చట్టబద్ధత లేదు: టీడీపీ నేతల ఫైర్..!రాజధానిని కదిలిస్తే రాష్ట్రం అగ్నిగుండమే: కమిటీకి చట్టబద్ధత లేదు: టీడీపీ నేతల ఫైర్..!

సీమకు రాజధాని కేటాయించండి..
ముఖ్యమంత్రి జగన్..హైపవర్ కమిటీకి రాయలసీమ ప్రముఖులు వేర్వేరుగా లేఖలు రాసారు. గ్రేటర్ రాయలసీమకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు..ప్రజాం సంఘాల నేతలు సంతకాలు చేసారు. గ్రేటర్ రాయలసీమ వాసుల సెంటిమెంట్ ను గుర్తించి రాజధానిని రాయలసీమకు కేటాయించాలని ఆ లేఖలో డిమాండ్ చేసారు. సీమ ప్రాంతంలో వెనుకబాటు తనం గత ప్రభుత్వాల మోసాల వల్ల ఎంతో నష్టపోయా మంటూ అందులో వివరించారు. ప్రధాన ప్రాజెక్టుల ఏర్పాటులో కూడా రాయలసీమ వాసులు ఎలాంటి లాభా పేక్ష లేకుండా త్యాగాలు చేశారని గుర్తు చేసారు. ఈ ప్రాంత వాసులు త్యాగాలు మనోభావాలు, ఆత్మగౌరవాన్ని హై పవర్ కమిటీ గుర్తించి న్యాయం చేయాలని అభ్యర్ధించారు. హైపవర్ కమిటీలోనూ సీమ ప్రాంతానికి చెందిన ముగ్గురు మంత్రులే ఉన్నారని..మిగిలిన వారు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారైనా సమీ వాసుల సెంటిమెంట్ గౌరవించి రాయలసీమలో రాజధానికి సిఫార్సు చేస్తామంటూ ఆకాంక్ష వ్యక్తం చేసారు.

Rayalaseema leders letter to CM to announce capital in Greater Rayalaseema

ఆ రెండు కమిటీలకు అవి పట్టవంటూ..
జీఎన్ రావు..బోస్టన్ కమిటీల పైన సీమ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. త్యాగాలు..మనోభావాలు..ఆత్మగౌరవం..హక్కులు లాంటి పదాలకు జీఎన్ రావు..బోస్టన్ కమిటీల నిఘంటువులో అర్దం ఉండదని ఎద్దేవా చేసారు. ప్రజల నుండి వచ్చిన వారు మాత్రమే ఆ పదాలకు అర్దాలను..మనోభావాలను అవగతం చేసుకోగలుగుతారని పేర్కొన్నారు. సీమ వాసులు చేసిన త్యాగాలను కాల రాయకుండా గతంలో ఉన్న రాజధానిని గ్రేటర్ రాయలసీమలో పునరుద్దరించాలని ఆ లేఖలో అభ్యర్ధించారు. ఈ లేఖ పైన సంతకాలు చేసిన వారిలో మైసూరా రెడ్డి, గంగుల ప్రతాప రెడ్డి, మాజీ మంత్రులు శైలజా నాద్, చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయ రెడ్డి, దినేష్ రెడ్డి పలువురు ప్రముఖులు ఉన్నారు. మఖ్యమంత్రికి రాసిన లేఖలో సీమ ప్రాంతంలో 2019 ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి మెజార్టీ సీట్లు కట్టబెట్టామని..తమ ప్రాంత ప్రజల మనోభాలను పరిగణలోకి తీసుకొని సీమలో రాజధాని ఏర్పాటు చేయాలని అభ్యర్ధించారు.

English summary
Rayalaseema senior leaders and intellecutals letter to Cm Jagan and Hi power committee to announce capital in Greater Rayala seema. They mentioned previousely they lost capital from seema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X