రాజంపేట లో టిడిపి కొత్త ఇంఛార్జ్ : ఇక..మేడా ఔట్ : వైసిపి సీటు ద‌క్కేనా..!

క‌డ‌ప జిల్లా లో ఏకైక టిడిపి ఎమ్మెల్యే పార్టీ వీడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆయ‌న ఇంకా పార్టీకి రాజీనామా చేయ‌క‌ముందే రాజంపేట‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌ నియామ‌కానికి రంగం సిద్దమైంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు అధికారిక నిర్ణ‌య‌మే మిగిలి ఉం ది. ఇక‌, మేడా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లుగా వైసిపి లో చేరాల్సి ఉంది. మ‌రి..ఆయ‌న‌కు రాజంపేట సీటు వైసిపి లో ఖాయ మేనా అంటే...అది స్ప‌ష్ట‌త రావాల్సి ఉందంటున్నారు ఆయ‌న వ‌ర్గీయులు.

టిడిపి లో కొత్త ఇన్‌ఛార్జ్..

టిడిపి లో కొత్త ఇన్‌ఛార్జ్..

2014 ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలో టిడిపి ఒక్క సీటు మాత్ర‌మే గెలుచుకుంది. రాజంపేట నుండి టిడిపి అభ్య‌ర్ధిగా మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి గెలుపొందారు. త‌రువాత ఆయ‌న‌కు విప్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే, జిల్లాలో రాజ‌కీయాల కార‌ణంగా మేడా పార్టీని వీడి వైసిపిలో చేరాల‌ని భావించారు. ఆయ‌న సోద‌రుడు వైసిపి అధినేత జ‌గ‌న్ తో స‌మావేశ‌మై ఈ మేర‌కు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

మంత్రి ఆది నారాయ‌ణ

మంత్రి ఆది నారాయ‌ణ

దీంతో..ఈ వ్య‌వ‌హారం టిడిపి అధినాయ‌కత్వం దృష్టికి వెళ్లింది. వెంట‌నే మంత్రి ఆది నారాయ‌ణ రాజంపేట నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశం పై మేడా వ‌ర్గీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇక‌, ఆయ‌న పార్టీ వీడ‌టం ఖాయ‌మ‌నే భావ‌న‌కు పార్టీ వ‌చ్చేసింది. దీంతో..అక్క‌డ కొత్త నేత‌ను ఇన్‌ఛార్జ్ గా తీసుకురావ‌టాని కి ఎంపి సీయం ర‌మేష్ పావులు క‌దుపుతున్నారు. రెడ్‌ బస్‌ యాప్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. చ‌ర‌ణ్‌రాజు ను రాజంపేట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ గా నియ‌మించ‌టం దాదాపు ఖాయ‌మైందని స‌మాచారం. 22 న క‌డ‌ప నేత‌లు సీయం ను క‌లిసి ఈ విష‌యం పై ప్ర‌క‌ట‌న చేయించాల‌ని భావిస్తున్నారు.

మేడా కు వైసిపి లో సీటు ద‌క్కేనా..

మేడా కు వైసిపి లో సీటు ద‌క్కేనా..

ఇక‌, మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి టిడిపి వీడి వైసిపి లో చేర‌టం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. ఆయ‌న పార్టీ వీడే ఆలోచ‌న చేయ‌లేద‌ని చెబుతున్నా..ఇప్పుడు టిడిపి లో కొనసాగే ప‌రిస్థితి కూడా లేదు. దీంతో..వైసిపి లో చేరుతార‌ని ఆయ‌న వ‌ర్గీ యులు చెబుతున్నారు. అయితే, రాజంపేట నుండి జ‌గ‌న్ కు సన్నిహితుడైన అమ‌ర‌నాధ రెడ్డి ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేసిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి చేతిలో ఓడిపోయారు.

తాజా ప‌రిణా మాల నేప‌థ్యంలో మేడా మల్లిఖార్జున రెడ్డికి రాజంపేట సీటు ఇస్తామ‌నే హామీ ఇస్తే వైసిపిలో చేర‌టానికి సిద్దంగా ఉన్న ట్లుగా జ‌గ‌న్ వ‌ద్ద‌కు రాయ‌బారాలు న‌డిచాయి. అయితే, జ‌గ‌న్ పార్టీలో తొలి నుండి ఉన్న అమ‌ర‌నాధ్ రెడ్డికి ప్ర‌త్యా మ్నాయం చూపించ‌కుండా మేడా కు రాజంపేట సీటు ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. దీంతో ..ఇప్పుడు టిడిపి లో ఉండ‌లేక‌..వైసిపి లో సీటు పై పూర్తి స్ప‌ష్ట‌త రాక‌..మేడా కొంత డైల‌మా లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే, వైసిపి నేత‌లు మాత్రం మేడా వైసిపి లో చేరితే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+