కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ స‌మ‌ర‌శంఖం : బ‌స్ యాత్ర ర‌ద్దు : త‌ట‌స్థ ఓట‌ర్ల కోసం ఇలా..!

|
Google Oneindia TeluguNews

మ‌రి కొద్ది రోజుల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానుంది. దీని కోసం వైసిపి అధినేత జ‌గ‌న్ స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్నారు. ఇందు కోసం బ‌స్సు యాత్ర‌ను ర‌ద్దు చేసుకున్న జ‌న‌గ్.. పోలీ మేనేజ్‌మెంట్ పై దృష్టి పెట్టారు. ఈ ఎన్నిక‌ల్లో అధికార టిడిపి సంక్షేమ ప‌ధ‌కాల అమ‌లుతో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. త‌మ ప‌ధకాల‌ను టిడిపి కాపీ కొడుతుంద‌ని వైసిపి ఆరోపిస్తోంది. ఈ వ్య‌వ‌హారం పై జ‌గ‌న్ స్పందిచ‌నున్నారు.

ఇక ప్ర‌జ‌ల్లోనే..స‌మ‌ర‌శంఖం..

ఇక ప్ర‌జ‌ల్లోనే..స‌మ‌ర‌శంఖం..

సుదీర్ఘ పాద‌యాత్ర పూర్తి చేసిన జ‌గ‌న్ ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్నారు. దీని కోసం వ‌చ్చే నెల 4వ తేదీ నుండి కొత్త కార్యాచ‌ర‌ణ సిద్దం చేసారు. అందులో భాగంగా..ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు బూత్‌ కన్వీనర్లు, కమిటీల సభ్యులకు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. వచ్చే నెల 4న తిరుపతిలో సమర శంఖారావం ప్రారంభమవుతుందని తెలిపారు. సమర శంఖారావం పేరుతో నిర్వహించే జిల్లా స్థాయి సమావేశాల్లో బూత్‌ కన్వీనర్లు, కమిటీల సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొంటారు. శంఖారావం సభలను 13 జిల్లాల్లోనూ నిర్వహించ‌నున్నారు. వచ్చే నెల 4న చిత్తూరు, 5న వైఎస్సార్, 6న అనంతపురం జిల్లాల్లో సభలు ఏర్పాటు చేసి..ఫిబ్రవరి చివరి నాటికి అన్ని జిల్లాల్లో సభలు పూర్తి చేయ‌నున్నారు.

'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?

పోల్ మేనేజెమెంట్ పైనే దృష్టి..

పోల్ మేనేజెమెంట్ పైనే దృష్టి..

ఇప్ప‌టికే అభ్య‌ర్దుల ఎంపిక పై ఓ అంచాన‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌..ఇక పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్ట‌నున్నారు. ఇందు కోసం బూత్ లెవ‌ల్ క‌మిటీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతున్నారు. వైసిపికి జ‌న‌బ‌లం ఉన్నా...దానికి ఓటుగా మార్చు కోవ‌టంతో విఫ‌ల‌మ‌వుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతూ వ‌స్తున్నారు. ఎన్నిక‌లు- పోల్ మేజేజ్‌మెంట్ లో టిడిపి బ‌లంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ అంశాన్ని విస్మరించిన వైసిపి..ఇప్పుడు మాత్రం ముందుగానే అప్ర‌మ‌త్తం అవుతోంది. ఇందులో భాగంగా..ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో శిక్ష‌ణా శిబిరాలు నిర్వ‌హించారు. ఇక‌, ఇప్పుడు పార్టీ అధినేత నేరుగా వారితో క‌ల‌వ‌టం ద్వారా వారిని మ‌రింత క్రియాశీల‌కంగా మార్చ‌ట‌మే లక్ష్యంగా చెబుతున్నారు. ఇదే స‌మ‌ర‌శంఖం స‌మ‌యం లోనే అభ్య‌ర్ధుల‌ను సైతం అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

బ‌స్సు యాత్ర ర‌ద్దు..త‌ట‌స్థుల కోసం ఇలా..

బ‌స్సు యాత్ర ర‌ద్దు..త‌ట‌స్థుల కోసం ఇలా..

పాద యాత్ర త‌రువాత బస్సు యాత్ర చేయాల‌ని జ‌గ‌న్ తొలుత భావించారు. అయితే, ఎన్నిక‌ల షెడ్యూల్ మ‌రింత ముందుగానే వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో...ముందుగా పోల్ మేనేజ్మెంట్ కీల‌క‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇదే స‌మ యంలో అభ్య‌ర్ధుల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌టించి..వారికి ప్ర‌చారానికి వీలైనంత ఎక్కువ స‌మ‌యం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇక‌, దీంతో పాటుగా న్యూట్ర‌ల్ ఓట‌ర్ల‌ను ఆకట్టుకొనేందుకు ఏ పార్టీకి చెంద‌ని ప్ర‌ముఖ వ్య‌క్తుల‌తో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గ వారిని స‌మీక‌రించి జిల్లా స్థాయిలోనే ఈ స‌మ‌ర‌శంఖం స‌భల‌తో పాటుగా వారితోనూ ఆత్మీయ స‌ద‌స్సుల ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం త‌ట‌స్థుల‌ను గుర్తించే బాధ్య‌త నియోక‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు అప్ప‌గిం చారు. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారం నుండి చివ‌రి వారం వారంలోగా మొత్తం స‌మాయ‌త్త స‌భ‌ల‌ను ముగించి..ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగే విధంగా జ‌గ‌న్ త‌న కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకున్నారు.

English summary
YCP Chief jagan Planning to tour 13 districts in Ap to conduct booth level volunteers meeting to prepare for elections. Jagan cancelled his bust tour and decided to announce party candidates as early as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X