వివేకా కేసులో అవినాష్ రెడ్డి అనూహ్య నిర్ణయం- కీలక అంశాలను ప్రస్తావిస్తూ
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు సాగిన దర్యాప్తు వ్యవహారంపై కొత్త సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు సీబీఐ నుంచి నోటీసులను అందుకున్నారు. విచారణకూ హాజరయ్యారు. తాను అన్ని విషయాలను సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తోన్నారు. వివేకా హత్యకేసులో తన వద్ద ఉన్న సమాచారం మొత్తాన్నీ వారికి వివరించానని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశాలేవీ లేవంటూ ముందునుంచీ చెబుతూ వస్తోన్నారాయన.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న హైప్రొఫైల్ మర్డర్ కేసు ఇది. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాన్ని ఆయన తోసిపుచ్చారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. వైఎస్ వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య, సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిల పేర్లను చేర్చారు.
ఈ పరినామాల మధ్య తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు అవినాష్ రెడ్డి. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు. కర్ణాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ కొద్దిరోజుల కిందటే సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. గతంలో పని చేసిన రామ్ సింగ్ స్థానంలో ప్రవీణ్ సూద్ అపాయింట్ అయ్యారు.
ఇప్పుడు తాజాగా రామ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు అవినాష్ రెడ్డి. ఆయనపై ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ హయాంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు మొత్తం పక్కదారి పట్టిందని పేర్కొన్నారు. పక్షపాత వైఖరితో రామ్ సింగ్ దర్యాప్తు చేశారంటూ ఆరోపించారు. రామ్ సింగ్ హయాంలో జరిగిన దర్యాప్తును పునఃసమీక్షించాలని అవినాష్ రెడ్డి కొత్త సీబీఐ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్‌షీట్ల ఆధారంగా అవినాష్ రెడ్డి ఈ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్‌మెంట్ అంశాలను సైతం ఆయన తన లేఖలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. గతంలో వివేకా వద్ద కారు డ్రైవర్‌గా పని చేసి, అనంతరం అప్రూవర్‌గా మారిన దస్తగిరి వ్యవహార శైలినీ గుర్తు చేశారు.
రెండో భార్య షమీమ్‌తో ఆస్తి తగాదా ఉన్న విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి తన లేఖలో పొందుపరిచారు. ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే వివేకాను హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. ఆస్తి కోణంలో ఇప్పటివరకూ విచారణ జరగలేదని అవినాష్ రెడ్డి తేల్చి చెప్పారు. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పులని సవరించాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని కోరారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications