ఇడుపులపాయకు వైఎస్ షర్మిల: పాదయాత్రకు ముందు తండ్రికి నివాళి: కంప్లీట్ షెడ్యూల్ ఇదే
కడప: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇవ్వాళ ఇడుపులపాయకు రానున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించనున్నారు. తెలంగాణలోని చేవెళ్ల నుంచి బుధవారం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టనున్న నేపథ్యంలో.. ఆమె తండ్రి ఆశీస్సులను తీసుకోవడానికి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. షర్మిల వెంట తల్లి వైఎస్ విజయమ్మ ఉంటారు. సాయంత్రం వరకూ ఇడుపులపాయలో గడుపుతారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

ఇడుపులపాయకు
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఈ ఉదయం ఆమె కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు వెళ్తారు. తల్లితో కలిసి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. సాయంత్రం వరకూ అక్కడే ఉంటారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుని, హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. ఈ సందర్భంగా పులివెందుల నుంచి వచ్చిన అతి కొద్దిమంది కుటుంబ సభ్యులను ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో కలుసుకుంటారు.

ప్రత్యామ్నాయ శక్తిగా..
2023లో తెలంగాణ అసెంబ్లీకి నిర్వహించే ఎన్నికల సందర్భంగా బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిల కనిపిస్తోన్నారు. పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపడంలో భాగంగా- ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం చేవెళ్లలో ఈ పాదయాత్ర ప్రారంభమౌతుంది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చేవెళ్ల నుంచే పాదయాత్రను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

90 నియోజకవర్గాల మీదుగా
తండ్రి అడుగుజాడల్లోనే నడిచేలా.. తన పాదయాత్రను మొదలు పెట్టడానికి వైఎస్ షర్మిల కూడా చేవెళ్లను ఎంచుకున్నారు. 400 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా వైఎస్ షర్మిల పాదయాత్ర 4,000 కిలోమీటర్ల మేర సాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు ఆమె తన పాదయాత్రను మొదలుపెడతారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగిస్తారు. మధ్యాహ్నం భోజనం కోసం విరామం తీసుకుంటారు.

సాయంత్రం 6 గంటల వరకు..
మళ్లీ 3 గంటలకు పాదయాత్రను మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిస్తారు. పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్‌ను తయారు చేస్తారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తారు. వాటిని పరిష్కరించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది?, ఎంత మేర బడ్జెట్ ఖర్చవుతుంది? అనే విషయంపై పార్టీ నేతలతో చర్చిస్తారు.

మండల స్థాయిలో..
వాటిని తక్షణమే పరిష్కరించాలంటూ కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్సార్టీపీ నాయకులు.. మండల స్థాయిలో పాదయాత్రలను నిర్వహిస్తారు. ఏ రోజు ఆమె ఏ నియోజకవర్గానికి చేరుకుంటారో.. ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు, స్థానికులతో కలిసి పాదయాత్రను చేపడతారు. స్థానిక అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్తారు.
Recommended Video

నిరాహార దీక్షకు బ్రేక్
వైఎస్ షర్మిల చేపట్టిన ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు బ్రేక్ పడింది. పాదయాత్రను ప్రారంభించడానికి తన తండ్రికి నివాళిని అర్పించాల్సి ఉన్న నేపథ్యంలో- వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉన్నందున నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు చెప్పారు. పాదయాత్ర కొనసాగించాల్సి ఉన్నందున.. అది ముగిసేంత వరకు ఈ దీక్ష ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications