అప్పు తీర్చుతావా .. చస్తావా .. నడిరోడ్డుపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి !
కరీంనగర్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. తన అప్పు తీర్చడం లేదంటూ నగరంలోని ఓ వ్యక్తిపై పట్టపగలే గోడ్డలితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే తన బైక్ లో పెట్టిన గొడ్డలి తీసీ దాడి చేశాడు. గాయపడ్డ వ్వక్తి ఆసుపత్రి తో చికిత్స పోందుతుండంగా దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్ధిక లావాదేవీలు ఇద్దరి మధ్య విద్వేషాలకు కారణమయ్యాయి. ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తున్నా, వ్యాపారంలో మోసం చేశాడంటూ మరోవ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు .వివరాల్లోకి వెళితే కరీంనగర్ పట్టణంలో ఉంటున్న తిప్పర్తి కిషన్ , లక్ష్మణ్ లు రియల్ వ్యాపారం తోపాటు, బంగారం వ్యాపారం చేస్తున్నారు. కాగా లక్ష్మన్ కు తిప్పర్తి కిషన్ కు మధ్య 5 సంవత్సరాల క్రితం భూమి కి సంబంధించి లావాదేవీలు జరిగాయి.

లక్ష్మణ్ , కిషన్ కు భూమిని అమ్మాడు .అయితే భూమికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో అది వివాదంలో పడింది .దీంతో తిరిగి తన డబ్బులు ఇవ్వాలంటూ లక్ష్మన్ కోరాడు. దీంతో ఇది గత అయిదు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. చాలసార్లు ఇద్దరి మధ్య పంచాయితీ కూడ జరిగినట్టు సమాచారం . అయితే ఎంతకు తన డబ్బులు ఇవ్వకపోవడంతో ఈరోజు కిషన్ ఇంటికి చేరుకున్న లక్ష్మన్ యధావిధిగా డబ్బులు అడిగాడు , కాసేపు మాట్లాడీ, ప్లాన్ ప్రకారం తాను తెచ్చుకున్న గొడ్డలిని తన టూ వీలర్ లోనుండి తీశాడు .
వెంటనే కిషన్ పై ఒక్కసారిగా దాడి చేశాడు. తలపై గొడ్డలి తో బాదాడు ,కాగా చాల సేపు ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో కిషన్ క్రింద పోయాడు, ఈ సమయంలోనే చుట్టుపక్కల వాళ్లు గుమికూడడంతో అక్కడ నుండి దాడి చేసిన లక్ష్మన్ తిన్నగా జారుకున్నాడు. గాయపడిన కిషన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న సీసీ కేమేరాలను పరీశీంచారు .వెంటనే దాడిచేసిన లక్ష్మణ్ ను అరెస్ట్ చేశారు. ఆయన పై కేసు నమోదు చేసీ దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications