Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరు ప్రియులు... ఒక భర్త... ! అడ్డువస్తున్నాడని హత్యాయత్నం చేసిన భార్య..!!

మానష్యుల్లో మానవత్వం కరువుతుంది. ఆధునిక సమాజంలో హత్యలు నేరాలు చేయడమే లక్ష్యంగా స్త్రీలు , పురుష తేడా లేకుండా కొనసాగుతున్నాయి. మనుషుల అవసరాల్లో ఆడ, మగ తేడా లేకుండా కొనసాగున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఆర్థిక నేరాల్లో మానవత్వం మంటగలుపుతున్న వారు అనేక నేరాలకు తెరలేపుతున్నారు. ఈ దీంతో కట్టుకున్న భర్తనే హత్య చేయాలని భార్యలు చూస్తున్నారు. అదికూడ ఇతరుతో సంబంధాలు పెంచుకుని నిండు నూరేళ్ల జీవితానికి చరమగీతం పాడుతున్నారు. అనాలోచితంగా చేసిన తప్పులకు కటకటాలు లెక్కపెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో ఓ ఇళ్లాలు దారుణానికి ఒడిగట్టింది. తాను కొనసాగించే అక్రమ సంబంధానికి అడ్డువస్తుండడంతో పాటు తనను ప్రశ్నించిన భర్తను కడతేర్చడానికి తన ఇద్దరు ప్రియులతో కలిసి చంపేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే అదృష్ట వశాత్తు తప్పించుకుని బయటపడిన భర్త పోలీసులను ఆశ్రయించాడు.కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణకు, కావేరి అనే యువతితో కొద్ది రోజుల క్రితమ వివాహం జరిగింది. అయితే, భార్య కావేరి ప్రవర్తన గురించి చుట్టుపక్కల వాళ్లు కొన్ని ఫిర్యాదులు చేశారు. అయినా వంశీకృష్ణ ఇవేమి పట్టించుకోలేదు. చుట్టు పక్కల వాళ్లు ఎన్ని చెప్పినా... కట్టుకున్న భార్య మీద నమ్మకంతో ఉన్నాడు.

A wife attempts to murder her husband with two boyfriends

అయితే భర్త నమ్మకాన్ని కావేరి వమ్ము చేస్తూ... ఆమె మొబైల్ ఫోన్‌లో ఉన్న ఫోటోలు చూసిన వంశీకృష్ణ షాక్‌కు గురయ్యాడు. కావేరి ఒకరు కాదు ఇద్దరితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసి భార్యను ప్రశ్నించాడు. దీంతో తమ గుట్టు బయటపడిపోవడంతో కావేరి భర్తను అంతం చేయాలని ప్లాన్ వేసింది.. దీంతో భర్త నిద్రపోతున్న సమయంలో తన ఇద్దరు ప్రియులతో కలసి ముఖం మీద దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలని స్కేచ్ వేశారు. దీంతో రెండు రోజుల క్రితం చంపేందుకు ప్రయత్నాలు చేయడంతో అప్రమత్తమైన భర్త వారి నుండి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+