బాల్క సుమన్‌కు పితృవియోగం.. అనారోగ్యంతో తండ్రి కన్నుమూత
చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు పితృ వియోగం కలిగింది. బాల్క సురేష్ మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో మృతి చెందారు. బాల్క సురేష్ మృతి పట్ల టీఆర్ఎస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
బాల్క సురేశ్ మృతి పట్ల సీఎం కే చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సురేశ్, టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారు. ఆయన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుమన్‌ను, సీఎం కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి జేఏసీ నేతగా సుమన్ చొచ్చుకొని వెళ్లారు. ఆ క్రమంలోనే కేటీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఓ న్యూస్ యాంకర్‌ను సుమన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

తర్వాత పెద్దపల్లి లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సుమన్ ఎదుగుతున్న క్రమంలో.. తండ్రి సురేశ్ మరణం వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.












Click it and Unblock the Notifications