హిందుత్వం లేకుంటే భారతదేశమే ఉండేది కాదు: హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్

కరీంనగర్: హిందువుల ఐక్యత కోసమే హిందూ ఏక్తా యాత్ర అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో భారీగా యువత పాల్గొన్నారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన యాత్రలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు హిందువు అంటే అందరికీ బంధువని.. ఇప్పుడు అన్ని బంద్ అనే పరిస్థితి నెలకొందన్నారు బండి సంజయ్.

హిందూ సమాజ శక్తిని చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. ఒక్క రాష్ట్రంలో గెలవకపోతే ఏం అవుతుందని.. 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని చెప్పారు. ఇక కర్ణాటకలో హిందూ ధర్మం ఆగిపోయిందని అన్నారు. ఏక్తా యాత్ర హిందువులను ఏకం చేస్తుందన్నారు. కర్ణాటకలో ఓడిపోతే హిందుత్వం లేకుండా పోతుందా? అని ప్రశ్నించారు బండి సంజయ్. హిందుత్వం లేకుంటే భారతదేశమే ఉండేది కాదన్నారు.

Bandi Sanjay speech in Karimnagar Hindu Ektha Yatra.

భాగ్యలక్ష్మి ఆలయం ఎలాగైతే హిందువులను ఏకం చేసిందో.. ఇప్పుడు ఏక్తా యాత్ర అదే గుర్తు చేస్తోందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా హిందూ ధర్మం ఉంటుందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. హిందూ ఏక్తా యాత్రలో భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణమంతా కాషాయమయంగా మారింది. ప్రధాన కూడళ్లలో కాషాయ జెండాలు, తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు.

మరోవైపు, కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం పోయి.. రామరాజ్యం రాబోతుందన్నారు హిమంత బిశ్వశర్మ. ఓవైసీ బెదిరింపులకు ఎవరూ భయపడబోరని.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాల్ విసిరారు. ఒవైసీ ఇంట్లోకి కూడా వస్తా.. ఏం చేస్తాడో చూస్తానన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. అసోంలో 6 వేల మదర్సాలనూ బంద్ చేయించామని.. వచ్చే ఏడాది మరో 1000 మదర్సాలనూ మూసివేస్తామన్నారు సీఎం హిమంత బిశ్వశర్మ.

ధనిక రాష్ట్రం అయిన తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఎందుకున్నాయని హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. అసోంలో లీటర్ డీజిల్ 92 రూపాయలే ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలివ్వడం లేదని.. బీజేపీ ప్రభుత్వం రాగానే ఒకటో తారీఖునే జీతాలిస్తామన్నారు. అంతేగాక,తెలంగాణలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ సర్కార్ పేరు ఢిల్లీలో మారుమోగుతోందని.. బీఆర్ఎస్ పెద్దలు లిక్కర్ దందాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ తప్పదని జోస్యం చెప్పారు హిమంత బిశ్వశర్మ. భారత్‌లో త్వరలోనే సివిల్ కోడ్ యూనిఫామ్ అమలు చేస్తామని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. భారత్‌ను ఎవ్వరూ భయపెట్టలేరని.. జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దుచేశామన్నారు. కేరళ స్టోరీని సెక్యులర్ వాదులు వ్యతిరేకిస్తున్నారని.. ఒక్కసారి వాళ్లు అస్సాం వచ్చి చూస్తే అర్థమవుతుందన్నారు. అసోం రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను అడ్డుకున్నామన్నారు. తాను అసోం వెళ్లి తెలంగాణలో మార్పు మొదలైందని చెప్తానన్నారు. మోడీ పేద ప్రజల అభివృద్ది కోసం కష్టపడుతున్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+