బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా: ఎములాడ రాజన్నను దర్శించుకున్న క్రేజీ జంట..
బుల్లెట్ బండెక్కి వచ్చేత పా.. అనే సాంగ్‌కి మాములు క్రేజీ లేదు. కొత్త జంట సాయి శ్రీయ, అశోక్ యావత్ ప్రపంచానికి తెలిసిపోయారు. ఇప్పుడు అంతా అదే పాట.. అదే చర్చ.. అయితే బుల్లెట్ పాట దంపతులు వరలక్ష్మీ వ్రతం వచ్చిన శుక్రవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పెళ్లి అయిన తర్వాత వేములవాడ రాజన్నను దర్శించుకోవడం కామనే.. కానీ ఈ జంట మాత్రం మామూలు క్రేజీ రాలేదు.

కోడె మొక్కు..
సాయి శ్రీయ దంపతులు వేములవాడ రాజన్నను దర్శించుకునే ముందు కోడె మొక్కును చెల్లించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు నూతన దంపతులకు ఆశీర్వచనం ఇచ్చారు. దంపతులు మొహానికి మాస్క్ వేసుకునే ఉన్నారు. లేదంటే మిగతా భక్తులు ఈజీగా గుర్తుపట్టేవారు. ఫోటో దిగేందుకు పోటీ పడేవారు.
బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా..
పెళ్లి అంటే సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అయ్యింది. సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాట తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. ఆ పాటకు వధువు చక్కగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా పాట పాడి డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు. వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది. వదువు డాన్స్‌ను వరుడు తాపీగా నిలబడి ఎంజాయ్ చేయసాగాడు. చివరలో బంధువులు, స్నేహితులు కూడా వధువుతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అల్లారుముద్దుగా పెరిగా..
నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పద అంటూ సరదాగా మొదలయ్యే ఆ పాటలో ఎక్కువగా వధువు గురించే ఉంది. అల్లారుముద్దుగా పెరిగినట్టు, తనను ఎక్కువగా గారాబం చేసి పెంచినట్టుగా వరుడితో వధువు చెప్పుకుంటోంది. పువ్వులా పెరిగాను అయినా నీ చేయి పట్టుకోవడానికి వస్తున్నా అంటూ ఆ పాట సాగుతుంది. మీ అమ్మానాన్నల్ని మా అమ్మానాన్నల్లాగే చూసుకుంటా అంటూ బంధాల గురించి ఆ పాటలో చరణాలు ఉన్నాయి. అందుకే నెట్టింట యూత్‌కు తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాయి శ్రీయ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత పేరు, వివరాలు తెలియడంతో ప్రతీ ఒక్కరూ దానినే షేర్ చేస్తున్నారు. అందరూ ఆశీర్వాదం కూడా అందజేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా బతుకు అంటూ బ్లెస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట కరోనా సమయంలో లక్షలాది మంది నుంచి మనస్పూర్తిగా బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఇవాళ వారు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications