కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష్యశుద్దితో ఏం చేసినా విజయమే: కేసీఆర్, కార్మిక, కర్షక క్షేత్రం సిరిసిల్ల: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన బిజీ బిజీగా సాగింది. అభివృద్ది పనులు/ శంకుస్థాపనలు చేసిన తర్వాత కేసీఆర్ మాట్లాడారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరని స్పష్టంచేశారు. లక్ష్యం ఏర్పాటు చేసుకున్నామని.. ఆ దిశగా ప్రయాణిస్తున్నామని వివరించారు. ఫలితాలు కనబడుతున్నాయని.. యావత్‌ ప్రపంచం కూడా చూస్తుందని చెప్పారు. లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి తోడైతే ఏదైనా వందశాతం అయితదని సీఎం అన్నారు.

కలెక్టరేట్ భవనం

కలెక్టరేట్ భవనం

సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని, సర్దాపూర్‌లో మార్కెట్‌యార్డు, గిడ్డంగులను, సిరిసిల్లలో నర్సింగ్‌ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్‌ శిక్షణ కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తాను హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ బిడ్డే..

తెలంగాణ బిడ్డే..


పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన కలెక్టరేట్‌ భవనం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణాలకు డిజైన్‌ చేసింది తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్‌ ఉషారెడ్డి అని తెలిపారు. వాటిని నిర్మిస్తోంది తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం: కేటీఆర్

కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం: కేటీఆర్


తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని సిరిసిల్ల కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమని ఆయన అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. గత ఏడేండ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతాలు జరిగాయన్నారు. మిడ్‌మానేరుకు రాజరాజేశ్వరస్వామి పేరు పెట్టుకున్నామని వివరించారు. కాళేశ్వరం పుణ్యాన మండుటెండలో మానేరు మత్తడి దుంకిన అద్భుత దృశ్యాన్ని చూడగలిగామన్నారు. కేవలం రిజర్వాయర్లు కట్టడం మాత్రమే కాదు మిషన్‌ కాకతీయ కూడా దిగ్విజయం అయినట్లు తెలిపారు.

ఏనాడు జూన్‌లో నీరు ఇవ్వలే

ఏనాడు జూన్‌లో నీరు ఇవ్వలే


అప్పర్‌మానేరు కట్టి 75 ఏైళ్లెనా గతంలో ఏనాడు జూన్‌ నెలలో నీళ్లు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మూలవాగు మీద 24 చెక్‌డ్యాంలు మంజూరు చేస్తే వాటిలో కేవలం 8 మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. మూలవాగుపై మరో 12 చెక్‌డ్యాంలు కట్టవచ్చని అధికారులు చెబుతున్నారని.. ఈ మేరకు వాటిని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అప్పర్‌మానేరు డ్యాం గతంలో ఏనాడు మరమ్మత్తులకు నోచుకోలేదని.. అప్పర్‌మానేరు రిపేర్ల కోసం నిధులు కేటాయించాలని సీఎంను కోరారు.

English summary
telangana cm kcr visits sircilla district for development works. in this tour minister ktr seeks funds allocated for check dams construction on mula vagu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X