ప్రియుడి మోజులో పడి.. భర్తా, పిల్లలకు విషంపెట్టింది, రాత్రిరాత్రే లేచిపోయింది!

కరీంనగర్: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత.. కట్టుకున్న భర్తను, తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డలను కూడా కాదనుకుంది. ఏకంగా వారి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధపడింది. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

సవ్యంగా సాగుతున్న కాపురంలో...

సవ్యంగా సాగుతున్న కాపురంలో...

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన విలాసాగరం అంజయ్య తన భార్య ఉమ, కొడుకు సిద్ధార్థ(11), మన్విత(4)తో కలిసి ఉంటున్నారు. అంజయ్యతోపాటే తల్లిదండ్రులు రాజేశం, లక్ష్మి కూడా ఉంటున్నారు. అంతా సవ్యంగా సాగిపోతున్న ఆ కాపురంలో ఉమ వివాహేతర సంబంధం నిప్పులుపోసింది.

ప్రియుడి మోజులో పడి.. భర్తా, పిల్లలకు విషం పెట్టింది..

ప్రియుడి మోజులో పడి.. భర్తా, పిల్లలకు విషం పెట్టింది..

అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం పెంచుకున్న ఉమ.. అతనితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ తర్వాత కుటుంబానికంటే అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. కుటుంబాన్ని కూడా అతని కోసం వదలుకునేందుకు సిద్ధపడింది ఉమ. ఈ క్రమంలు గురువారం రాత్రి పాయసం చేసింది. అందులో విషం కలిపింది. దాన్నే భర్త, పిల్లలతోపాటు అత్తామామలకు కూడా వడ్డించింది. ఆ పాయసాన్ని అంతా తిన్నారు. ఉమ అత్త మాత్రం ఆ పాయసాన్ని తినకుండా పడుకుంది.

రాత్రికి రాత్రే ప్రియుడితో జంప్..

రాత్రికి రాత్రే ప్రియుడితో జంప్..

ఈ క్రమంలో విషం కలిపిన పాయసం తిన్న వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించి ఉమ తనకు సంబంధించిన వస్తువులను తీసుకుని ప్రియుడితో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయింది. కాగా, శుక్రవారం ఉదయం అంజయ్య తేరుకుని ఉమ కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతికాడు. ఆమె బట్టలు కూడా లేకపోవడంతో కంగారుపడ్డాడు.

ఆమెను పిలుచుకుంటూ భర్త..

ఆమెను పిలుచుకుంటూ భర్త..

వెంటనే ఆమెను పిలుచుకుంటూ బయటికి వెళ్లాడు అంజయ్య. విష ప్రభావంతో కళ్లు తిరగడంతో అతడు అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయాడు. అతని కేకలు విన్న స్థానికులు వెంటనే బయటికి తీశారు. భార్య చేసిన పని గ్రామస్తులకు చెప్పడంతో వారు అంజయ్యతోపాటు ఆయన కుటుంబసభ్యులను ఆస్పత్రికి తరలించారు.

ప్రియుడి మోజులో పడి కుటుంబాన్నే చంపుతుందా?

ప్రియుడి మోజులో పడి కుటుంబాన్నే చంపుతుందా?


కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన తర్వాత అంజయ్య, రాజేశం, సిద్ధార్థ్ కోలుకోగా.. మన్వతి పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విష ప్రభావం అంతగా చూపకపోవడంతోనే వీరంతా బతికిపోయినట్లు తెలుస్తోంది. కాగా, అంజయ్య జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి కుటుంబాన్నే చంపాలనుకున్న ఉమపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+