• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హరీశ్‌రావుకు ఈటల గెలవాలని ఉంది.. వారే చెప్పారట..? రఘునందన్ రావు హాట్ కామెంట్స్

|

హుజురాబాద్ బై పోల్ ఆరోపణలు, ప్రత్యారోపణలతో మిన్నంటింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అదీ కూడా మంత్రి హరీశ్ రావు గురించి మాట్లాడారు. అదీ ఇవాళ చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే పదవీకి ఈటల రాజీనామా చేసింది మొదలు ఇప్పటివరకు బీజేపీ-టీఆర్ఎస్ నేతలు, మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సవాళ్లు, ప్రతి సవాళ్లు.. విమర్శలు, ప్రతి విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.

హరీశ్ ఇలా..

హరీశ్ ఇలా..


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు అనుకుంటున్నారట.. అవును బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు తనతో పోలీసులు చెప్పారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గెల్లు గెలిస్తే..

గెల్లు గెలిస్తే..


టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే 119లో 103వ ఎమ్మెల్యే అవుతారు. ఈటల రాజీనామా చేస్తే అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. మొన్న నన్ను వెల్లగొట్టారు.. నిన్న రాజేందర్‌ని, రేపు హరీష్ రావును టీఆర్ఎస్ నుంచి వెల్లగొడతారని హాట్ కామెంట్స్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో హరీష్ రావు తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. నై తెలంగాణ అన్న గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఇచ్చారని రఘునందన్ చెప్పుకొచ్చారు.

గెలుపెవరిదో..

గెలుపెవరిదో..


హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

తప్పనిసరి

తప్పనిసరి

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

  ఇందిరా పార్క్ లో మౌనదీక్షతో గర్జించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ!!
  దళితబంధు

  దళితబంధు

  హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

  English summary
  minister harish rao inner feeling is etela rajender win bjp mla raghunandan rao alleges
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X