కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుల్లెట్ బండెక్కి పాట డ్యాన్స్: నర్సుకు సాటి ఉద్యోగుల మద్దతు, చేసిన తప్పేంటీ..?

|
Google Oneindia TeluguNews

బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా.. సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఇటీవల సాయి శ్రీయ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తంగళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో బుల్లెట్ సాంగ్‌కు ఓ నర్సు డ్యాన్స్ చేశారు. అదీ కాస్త రచ్చ రచ్చ అయ్యింది. ఆ నర్సుకు కలెక్టర్ మెమో కూడా జారీచేశారు. విధులు నిర్వర్తించకుంట డ్యాన్సులు ఏంటీ అని ఫైరయ్యారు. దీనిపై తోటి నర్సులు మద్దతు స్పందించారు. ఆ సిస్టర్‌కు తమ మద్దతును ప్రకటించారు. అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు.

మెమో ఇవ్వడం ఏంటీ..?

మెమో ఇవ్వడం ఏంటీ..?

నర్సుకు అధికారులు మెమో ఇవ్వడాన్ని ఇతర నర్సులు వ్యతిరేకిస్తున్నారు. ఆ నర్సు డ్యూటీలో చేసిన తప్పేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాంత్ర్యం దినోత్సవం రోజున రిలాక్సేషన్ కోసం డ్యాన్స్ చేస్తే దాన్ని పెద్ద రాద్దాంతం చేయడం సరికాదన్నారు. సరదాకి అలా చేస్తే.. మెమో ఇవ్వడం సరికాదని ఆక్షేపించారు. ఈ మేరకు ఓ సీనియర్ నర్సు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యూటీలో మందు తాగిన వారిని, రూ. 20 కోట్లు స్కాం చేసిన వారిని ఏం చేశారని ఆమె ప్రశ్నించారు.

తప్పు చేసింది వారు..

తప్పు చేసింది వారు..

ప్రజారోగ్య డైరెక్టర్ తప్పు చేశారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చూపించినా.. ఆ అధికారిని ఏం చేశారని ఆమె ప్రశ్నలు గుప్పించారు. దీనిపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నర్సుకు మెమో ఇవ్వడం.. కొవిడ్ వారియర్లుగా పనిచేసిన నర్సులను అవమానించడమేనని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణ సంస్కృతిలోనే ఆటాపాట ఉందని, బతుకమ్మ పాటలతో ఆడిపాడించిన ప్రభుత్వం.. ఇలా నర్సుపై చర్యలు తీసుకోవడం సరికాదని, వెంటనే మెమో వెనక్కి తీసుకోవాలని అసోసియేషన్ కోరింది.

సేవలు మరిచారా..?

సేవలు మరిచారా..?

వాస్తవానికి కరోనా సమయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది చేసిన సేవలను మరవలేం. రేయిం బవళ్లు.. ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. డ్యూటీ చేస్తూ.. ప్రజల ప్రాణాలను కాపాడారు. ఆ సమయంలో వారిని అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ప్రంట్ లైన్ వారియర్స్ అంటూ కీర్తించారు. కానీ ఇప్పుడు ఓ పాటకు డ్యాన్స్ చేస్తే మాత్రం రాద్దాంతం చేస్తున్నారు. దీనిపై సాటి నర్సులు సపోర్ట్ చేస్తున్నారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి.. కుటుంబసభ్యులకు దూరంగా ఉండి పనిచేయలేదా అని అడగారు. చేసేదీ సేవ అని.. అయినా ఏదో క్యాజువల్‌గా డ్యాన్స్ చేస్తే రచ్చ రచ్చ చేయడం సరికాదని అంటున్నారు. ఇలా చేస్తే ఇతరుల్లో కూడా మనో ధైర్యం దెబ్బతింటుందని చెప్పారు. తమలో ఆత్మవిశ్వాసం పెంచాలే తప్ప.. ఇలా చేయడం సరికాదన్నారు.

డ్యాన్స్ వైరల్

పెళ్లి అంటే సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అయ్యింది. సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాట తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. ఆ పాటకు వధువు చక్కగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా పాట పాడి డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు. వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది. వదువు డాన్స్‌ను వరుడు తాపీగా నిలబడి ఎంజాయ్ చేయసాగాడు. చివరలో బంధువులు, స్నేహితులు కూడా వధువుతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పద అంటూ సరదాగా మొదలయ్యే ఆ పాటలో ఎక్కువగా వధువు గురించే ఉంది. అల్లారుముద్దుగా పెరిగినట్టు, తనను ఎక్కువగా గారాబం చేసి పెంచినట్టుగా వరుడితో వధువు చెప్పుకుంటోంది. పువ్వులా పెరిగాను అయినా నీ చేయి పట్టుకోవడానికి వస్తున్నా అంటూ ఆ పాట సాగుతుంది. మీ అమ్మానాన్నల్ని మా అమ్మానాన్నల్లాగే చూసుకుంటా అంటూ బంధాల గురించి ఆ పాటలో చరణాలు ఉన్నాయి. అందుకే నెట్టింట యూత్‌కు తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాయి శ్రీయ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత పేరు, వివరాలు తెలియడంతో ప్రతీ ఒక్కరూ దానినే షేర్ చేస్తున్నారు. అందరూ ఆశీర్వాదం కూడా అందజేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా బతుకు అంటూ బ్లెస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట కరోనా సమయంలో లక్షలాది మంది నుంచి మనస్పూర్తిగా బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత నర్సు డాన్స్ చేయడం.. మెమో ఇవ్వడం జరిగిపోయింది. ఈ క్రమంలో సాటి నర్సులు తమ మద్దతును ప్రకటించాయి. ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
healthcare workers support to bullet song dance nurse. what she has mistake in her duty they asked government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X