భర్త, భార్య.. ప్రేయసి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, డిష్యూం, డిష్యూం..
అతనికి పెళ్లయ్యింది. కూతురు పెళ్లికి ఎదిగింది. కుమారుడు ఉన్నాడు.. కానీ చెడు వ్యసనాలు మారలే.. బరువు లేదు.. బాధ్యత అంతకన్నా లేదు. ఈ మొగుడు వద్దు అని ఆమె అనుకుంది. డబ్బుల కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంకేముంది అతను తనలో గల మరో బుద్దిన బయటపెట్టాడు. వివాహితను తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య.. మళ్లీ వచ్చింది. కుమారుడు, కూతురుతో కలిసి రచ్చ రచ్చ చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన వాయినీల రాజేశం విజయకు 25 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి పెండ్లికి ఎదిగిన కూతురు - కుమారుడు ఉన్నారు... వ్యసనాలకు బానిసైన రాజేశం ..భార్య విజయను డబ్బులకోసం వేధింపులకు గురిచేసేవాడు. కొట్టి ఇంట్లోంచి తరిమివేశాడు. విజయ పుట్టింటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన రాజేశం ఏకంగా మహారాష్ట్రకు చెందిన రజిత అనే మరో వివాహితను తెచ్చుకొని ఇంట్లోనే కాపురం పెట్టాడు.

విషయం తెలుసుకున్న విజయ కాల్వశ్రీరాంపూర్‌కు చేరుకుంది. ఆ యువతి, రాజేశంను చితకబాదింది. వారికి స్థానిక మహిళలు సపోర్ట్ చేశారు. ఈ ఘటన అంతా సీరియల్‌ను తలపించింది. దాడులు, కేకలతో మిన్నంటింది. దీనికి సంబంధించి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ తర్వాత విజయ కాల్వశ్రీరాంపూర్ పోలీసులకు పిర్యాదు చేసింది.
Recommended Video
పెళ్లీడుకొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకుని.. మరో వివాహితతో రాజేశం కులికాడు. కడుపు రగిలిన భార్య.. వచ్చి దాడి చేసింది. తన జీవితంలో నిప్పులు పోశావని విలపించింది. అక్కడున్న స్థానికులు కూడా విజయకు సపోర్ట్ చేశారు. మద్దతుగా ఉండి.. రాజేశం, రజితను నిలువరించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications