హుజురాబాద్ టీఆర్ఎస్ కంచుకోట.. ఉద్యమకాలం నుంచే, ఈటల లేకముందే: నిరంజన్
హుజురాబాద్ బై పోల్ కోసం ప్రధాన పార్టీలు ఆన్ ఆఫీషియల్‌గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పటినుంచే ప్రజలతో కలిసిపోతున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. మేమేమన్నా తక్కువనా.. అని అధికార పార్టీ నేతలు కూడా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. హుజురాబాద్ తమ కంచుకోట అని చెబుతున్నారు. ఇవాళ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు.
Recommended Video
టీఆర్ఎస్‌కు హుజురాబాద్ కంచు కోట అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈటల రాజందర్ రాక ముందే ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. వచ్చే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుందని జోస్యం పలికారు. ఉప ఎన్నికల్లో ఒక్కరు కూడా తప్పు చేయవద్దన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి పునరుద్ఘటించారు.

గత 30,40ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు గొప్పవని ఆయన ప్రశంసించారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంటే మాటలు కాదని పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి టాక్స్ వెళ్లడమే తప్ప, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదని విమర్శించారు. కానీ పైకి మాత్రం గొప్పలు చెప్పుకుంటారని విమర్శించారు.
రూ.2 కిలో బియ్యం ఇస్తామంటే ఎన్టీఆర్‌ను సీఎంను చేసిన పేద రాష్ట్రం మనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఏదో ఒక దానికి కేంద్రం ఒక రూపాయి ఇస్తే, మాదే మొత్తం అని చెప్పుకోవడం దౌర్భాగ్యమన్నారు. ప్రజలకు అన్నీ తెలుసు అని వివరించారు.












Click it and Unblock the Notifications