కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ఊహించని సవాల్.. తలపట్టుకుంటున్న నేతలు..

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు కొత్త తలనొప్పి మొదలైంది. స్థానికులను వెంటాడుతున్న 'కోతుల బెడద' అభ్యర్థులకు పెద్ద సవాల్‌గా మారింది. కోతుల బెడదను పరిష్కరించేవారికే ఓట్లు వేస్తామని స్థానికులు చెబుతుండటంతో అభ్యర్థులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. నగరంలోని చాలా కాలనీల్లో కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నగరంలోని రాంనగర్,సప్తగిరి కాలనీ,మంకమ్మతోట,జ్యోతినగర్‌ సహా పలు కాలనీల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. వందల సంఖ్యలో కోతులు గుంపులు గుంపులుగా దండెత్తుతుండటంతో తాము బెంబేలెత్తిపోతున్నట్టు చెబుతున్నారు. కనీసం ఆరు బయట ఏవైనా వస్తువులు ఉంచాలన్నా.. లేక బియ్యం లాంటివి ఆరబెట్టాలన్నా జంకుతున్నట్టు చెబుతున్నారు.
గుంపులు గుంపులుగా ఇళ్ల మీదకు వస్తుండటంతో.. ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని పగటిపూట కూడా ఇంటి తలుపులు పెట్టుకునే ఉంటున్నామని తెలిపారు.

చిన్న పిల్లలపై దాడి చేసే అవకాశం ఉండటంతో.. వారిని బయటకు కూడా పంపించలేకపోతున్నామని అన్నారు. ప్రతీరోజూ కోతులను దృష్టిలో పెట్టుకునే పనులు చేయాల్సి వస్తుందని.. ప్రతీ క్షణం వాటి భయంతోనే గడపాల్సి వస్తుందని వాపోయారు. బయటకు వెళ్లే సమయాల్లో కోతుల దండు ఎదురైందంటే.. ఇంట్లోకి పరిగెత్తుకొచ్చి తలుపులు వేసుకుంటున్నామని చెప్పారు. దీంతో ఆరోజు పనులు వాయిదా పడిపోతున్నాయన్నారు. స్థానిక అధికారులు తమకు కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని, కోతులను గుంపులను నగరం అవతలికి తరలించాలని కోరుతున్నారు.

Monkey menace in karimnagar become an issue for municipal election contestants

తాజా మున్పిపల్ ఎన్నికల్లోనూ ఈ అంశం కీలకంగా మారింది. ఓట్ల కోసం వచ్చే అభ్యర్థులను కోతుల బెడదపై నిలదీస్తామని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కోతుల బెడదను నివారించినవారికే ఓటు వేస్తామని వారు చెబుతున్నారు. దీంతో కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కోతుల బెడద అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై స్థానికులకు ఎలా నచ్చజెప్పాలో.. కోతులను ఎలా తరలించాలో తెలియక.. అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

కాగా, కోతుల బెడదను భరించలేక గతేడాది నిజామాబాద్‌కి చెందిన ఓ రైతు ఏకంగా 'కోతుల బెడద బాధితుల సంఘం'ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ సంఘం సభ్యులు తమ గ్రామాల పరిధిలో జరిగే కోతుల దాడులను అడ్డుకునేందుకు తమ సొంతంగా కొన్ని చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా నివేదికలు సమర్పిస్తున్నారు. ఏదేమైనా దేశం మొత్తాన్ని వెంటాడుతున్న ఈ కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం మాత్రం ఉంది.

English summary
monkey menace issue is likely to cause a stiff challenge to contestants in municipal elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X