పుట్ట మధు ఇష్యూతో ప్రభుత్వానికి సంబంధం లేదు: గంగుల కమలాకర్
ఈటల రాజేందర్ ఇష్యూతో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అయితే అనుచరులపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుపై దృష్టిసారించింది. ఈటలతో గల లావాదేవీలతో పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లగా.. ఏపీలో ఆచూకీ లభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పుట్టమధును జెడ్పీ చైర్మన్ పదవీ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో స్థానిక మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.
పుట్ట మధు ఇష్యూతో ప్రభుత్వానికి సంబంధం లేదని కమలాకర్ చెప్పారు. కానీ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. ఇవాళ ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. పుట్ట మధు వ్యవహారంతో సర్కార్‌కు సంబంధం లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు హస్తానికి సంబంధించిన కూపీని పోలీసులు లాగుతున్నారు. ఈ క్రమంలో కమలాకర్ రియాక్టయ్యారు.

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పారు. ఇక్కడ ఎవరూ గెలిచిన అదీ కేసీఆర్ క్రెడిట్ అని చెప్పారు. ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌కు కేసీఆర్‌ను చూసే ఓటు వేశారని తెలిపారు. కారు గుర్తు, కేసీఆర్ భొమ్మ ఇంపార్టెంట్ అని చెప్పారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరికీ అండగా తాము ఉంటామని చెప్పారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications