వైభవంగా శ్రీవారి ఆలయ శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్, మంత్రి గంగుల!!
కరీంనగర్ లో టిటిడి ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి నేడు ఘనంగా శంకుస్థాపన జరిగింది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీవారి ఆలయ శంకుస్థాపన సందర్భంగా టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్ లోని పద్మనగర్ ప్రాంగణంలో తిరుమల తిరుపతి వేదపండితులచే టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ప్రణయ కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి టీటీడీ తరఫున 20 కోట్ల నిధులను కేటాయించడంతోపాటు సంపూర్ణంగా తిరుమల మాదిరే క్రతువులు నిర్వహిస్తామని, తిరుమల వేద పండితులు నిరంతరం ఇక్కడే ఉంటారన్నారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ నిర్మాణంపై చూపిస్తున్న శ్రద్ధ సంతోషం కలిగిస్తుందన్నారు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కరీంనగర్లో శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వరుని కృపతోనే కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణం సాకారం అయిందన్నారు. ఆలయ స్థలంలో ఆ దేవదేవుడే కోనేరు లాంటి పురాతన బావిని తనకిష్టమైన చింత చెట్టును ఏర్పాటు చేసుకోవడమే ఈ వైభవానికి నిదర్శనం అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి కరీంనగర్ ప్రజా ప్రతినిధులు ఆలయ అనుమతి కోసం ప్రతిపాదన చేసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా లేఖ రాయడం, కరీంనగర్ లో పదెకరాల స్థలాన్ని కేటాయించడం, తదనంతరం ఏపీ సీఎం ఆమోదంతో టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరగడం చాలా సంతోషకరమన్నారు.
టీటీడీ 20 కోట్ల నిధులతో ఆలయాన్ని నిర్మిస్తుందని మిగతా నిర్మాణ నిధులను భక్తులమే సమకూర్చుకుంటాము అని ఆయన పేర్కొన్నారు. వెయ్యేళ్ల కాలంలో దొరికే ఈ గొప్ప కార్యంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు . కరీంనగర్ ప్రజలందరికీ ఈ అదృష్టం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని భక్తులు హాజరవ్వాలని మంత్రి మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications