కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండికి షాక్.. ఇద్దరు కార్పొరేటర్లు టీఆర్ఎస్‌లో చేరిక..? మరో 10 మంది కూడా.. సొంత ఇలాకాలో..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపే అవుతుంది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్, నేతలు లేకున్నా.. కౌంటర్ అటాక్ చేస్తోంది. ఉన్నా కాంగ్రెస్ పార్టీ గుమ్మనకుండా ఉంటోంది. ఇక విషయానికి వస్తే.. బండి సంజయ్ ఇలాఖా.. కరీంనగర్‌లో షాక్ కలిగిస్తోంది. అవును ఓ వైపు తెలంగాణలో పాలనా పగ్గాలు చేపడుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న వారికి ఇదీ నిజంగా షాకే. కాషాయ పార్టీ రోడ్‌మ్యాప్‌ రెడీ చేసుకుందని చెబుతున్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం పోకస్ పెట్టింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అమిత్‌షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమన్వయం చేస్తున్నారు.

బీజేపీకి పట్టు..

బీజేపీకి పట్టు..


బీజేపీకి ఉత్తర తెలంగాణలో మంచిపట్టు ఉంది. ముఖ్యంగా కరీంనగర్‌లో పట్టు సాధించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా కూడా సాటింది. కరీంనగర్‌ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఎన్నిక కావడంతో సహజంగానే బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చింది. కరీంనగర్ లోక్‌సభ నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలిచారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించి.. జిల్లాలో కమలాన్ని వికసింపజేశారు.

టీఆర్ఎస్ పార్టీ ఇలా..

టీఆర్ఎస్ పార్టీ ఇలా..


ఇక్కడే టీఆర్‌ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బండి సంజయ్‌ని దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతోంది. సంజయ్‌కి దూకుడుకు కళ్లెం వేసేందుకు కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్‌లో చేరనున్నారని సమాచారం. ఇదీ బీజేపీకి షాక్ ఇచ్చే అంశమే. మరో 10 మంది బీజేపీ కార్పొరేటర్లతో టీఆర్‌‌ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇదే జరిగితే కాషాయపార్టీకి ఇబ్బందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కమల దళానికి ఇబ్బందే

కమల దళానికి ఇబ్బందే


బండి సంజయ్ సొంత నగరంలో ఇలా జరిగితే బీజేపీకి దెబ్బే.. ఇక మిగతా చోట్ల టీఆర్ఎస్ వార్ వన్ సైడ్ అవనుంది. బీజేపీ కార్పొరేటర్లకు అధికార పార్టీ మంచి ఆఫర్ ఇచ్చి ఉంటుంది. అందుకే వారు ఇలా జంప్ అవబోతున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా ఇదీ చర్చకు దారితీసింది. కానీ కమల దళం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందా..? వారు నిజంగా చేరతారా అనే అంశం మరికొద్దీ గంటల్లో తేలనుంది.

English summary
two bjp corporators in karimnagar may join trs party in tomorrow sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X