టీఆర్ఎస్ అభ్యర్థికి ఘోర పరాభవం, ప్రచారానికి వెళ్తే చెప్పులతో తరిమికొట్టిన జనం (వీడియో)

అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి శుక్రవారం ఘోర పరాభవం ఎదురైంది. ఓ గ్రామంలో గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వారిని చెప్పులతో వెంబడించారు. వారిని తరిమి తరిమి కొట్టారు.

అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, ఆయన మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బంజారా గిరిజనులు ఆయనకు చెప్పులతో నిరసన తెలిపారు. ఆయన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద ఎత్తున వాహనాలతో అభ్యర్థి ప్రచారం కోసం వచ్చారు. కానీ ఘోర పరాభవం ఎదురైంది.

తాటి వెంకటేశ్వర్లు పైన ఆ గ్రామస్తులు చూపిన ఆగ్రహంతో కాళ్లకు బుద్ధి చెప్పాల్సినంత పని అయింది. ఇన్నేళ్ల పాటు ఎక్కడున్నావని, ఎన్నికల సమయంలో ఇప్పుడు వస్తున్నావా, ఎప్పుడైనా తమ గ్రామానికి వచ్చి, సమస్యలు అడిగావా అని వారు రాయలేని విధంగా తిట్లు తిట్టారు.

Bitter experience to Thati Venkateswarlu, people show slippers him

నీకు ఇప్పుడు ఎన్నికలు వచ్చాక మేం కనిపించామా అని ప్రశ్నించారు. ఈ గ్రామంలో ఏ కొంతమందో అతనికి వ్యతిరేకంగా చెప్పులతో నిరసన తెలిపినట్లుగా లేదు. అది లంబాడీ తండ. ఆ తండాలోని గిరిజనులు అందరూ అతనికి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని తండావాసులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+