ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీ ఇంటికి.. మేము ఢిల్లీకి: విశాఖ ఉక్కుపై భరోసా..: అగ్నిపథ్‌పైనా: గర్జించిన కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మొన్నటి వరకు మనుగడలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి- భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఇక పార్టీ విస్తరణ కార్యకలాపాలపై కసరత్తు చేస్తోన్నారు. అటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిరాటంకంగా కొనసాగిస్తూనే- జాతీయ రాజకీయాలకు మరింత పదును పెడుతున్నారు..క్రియాశీలకంగా వ్యవహరించబోతోన్నారు.

బీఆర్ఎస్ గా..

బీఆర్ఎస్ గా..

గత ఏడాది కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా బదలాయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు డిసెంబర్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తరువాత బీఆర్ఎస్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు కేసీఆర్. పొరుగు రాష్ట్రాలపైనా పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు.

ఖమ్మం సభలో..

ఖమ్మం సభలో..

ఖమ్మం సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తనదైన శైలిలో విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ ఆవిర్భావానికి గల కారణాలనూ వెల్లడించారు. తనకు ఇష్టమైన వారి కోసం మోదీ ప్రైవేటైజేషన్ విధానాన్ని అనుసరిస్తోన్నారని, 43 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్న ఎల్‌ఐసీని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని గుర్తు చేశారు.

2024 తరువాత మోదీ ఇంటికి. .

2024 తరువాత మోదీ ఇంటికి. .

2024 తరువాత ప్రధాని మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని, తాము ఢిల్లీకి వెళ్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని అన్నారు. రైతులు, శ్రామికులు, కర్షకులు..బీఆర్ఎస్ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మత విధ్వేషం మంటల మధ్య కేంద్ర ప్రభుత్వం యువతను, వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఇకపై అలాంటి విన్యాసాలు చెల్లబోవని హెచ్చరించారు.

20,000 టీఎంసీలు..

20,000 టీఎంసీలు..

దేశంలో 70 వేల టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. 20 వేల టీఎంసీలు మాత్రమే వినియోగలో ఉన్నాయని కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల తరువాత కూడా విషపు నీళ్లే దేశ ప్రజలకు గతి అయ్యాయని ధ్వజమెత్తారు. దీనికి కారణమైన పాపాత్ములు ఎవరని నిలదీశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లల్లో రూపొందించిన ప్రణాళికలు, నిర్మించిన ప్రాజెక్టులే తప్ప అతీగతీ లేదని ఆరోపించారు.

బ్రజేష్ ట్రిబ్యునల్ పై..

బ్రజేష్ ట్రిబ్యునల్ పై..

రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిస్థితి దయనీయంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అందులో ఉన్న జడ్జీలు ఎప్పుడు హరీ అంటారో తెలీదని చురకలు అంటించారు. బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేది ఎప్పుడు? ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? అంటూ ఆయన ప్రశ్నించారు. దేశంలో ఒక్క భారీ రిజర్వాయర్ కూడా లేదని కేసీఆర్ అన్నారు. నీళ్లన్నీ సముద్రం పాలవుతుంటే మనం సన్నాసుల్లా ఇట్లాగే చూస్తూ ఉండాలా? అని ప్రశ్నించారు.

ప్రశ్నించు.. సాధించు..

ప్రశ్నించు.. సాధించు..

కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకలు చేస్తోన్న తప్పును ప్రశ్నించడానికి, హక్కులను సాధించడానికే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ తరహా ఉద్యమం దేశవ్యాప్తంగా తెస్తామని అన్నారు. రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందని అన్నారు. రావి, బియాస్ నదుల కోసం పంజాబ్-హర్యానా, మహానది జలాల కోసం ఒడిశా-ఛత్తీస్ గఢ్, కావేరీ కోసం తమిళనాడు-కర్ణాటక, గోదావరి నీటి హక్కుల కోసం మహారాష్ట్ర-కర్ణాటక-తెలంగాణ-ఏపీ పోరాడుతున్నాయని అన్నారు.

చాటలో తవుడు పోసి..

చాటలో తవుడు పోసి..

చాటలో తవుడు పోసి కుక్కల మధ్య కొట్లాట పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ఘర్షణ పెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. చట్టస్ఫూర్తి లేక.. సహజ సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక, డొల్ల, కల్ల మాటలు చెబుతూ నిద్రపుచ్చే పాలకులు అవసరమా? అంటూ ఖమ్మం సభా వేదిక మీది నుంచి కేసీఆర్ గర్జించారు.

రెండేళ్లల్లో

రెండేళ్లల్లో

రెండేళ్లల్లో వెలుగు జిలుగుల భారత్ దేశాన్ని నిర్మించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దేశం మొత్తానికి తెలంగాణ మోడల్ లో ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. మోదీ ప్రైవేటైజేషన్ పాలసీని పాటిస్తోంటే తాము నేషనలైజేషన్ అని నినదిస్తున్నామని కేసీఆర్ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనివ్వబోమిన కేసీఆర్ అన్నారు.

అగ్నిపథ్ రద్దు..

అగ్నిపథ్ రద్దు..

ఎల్ఐసీని విక్రయించినా.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని వాపస్ తీసుకుంటామని తేల్చి చెప్పారు. అగ్నిపథ్ పేరుతో ఆర్మీలో అత్యంత వివాదాస్పదంగా నియామకాలకు కేంద్ర ప్రభుత్వం తెర తీసిందని, తాము అధికారంలోకి వస్తే- దాన్ని రద్దు చేస్తామనీ కేసీఆర్ ప్రకటించారు. పార్టీకి సంబంధించిన విధి విధానాల రూపకల్పన జరుగుతోందని, త్వరలోనే దీన్ని ప్రకటిస్తామని చెప్పారు.

English summary
BRS meeting at Khammam: Why is the Bharat Rashtra Samithi born, Party Chief and CM KCR explained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X