injection fear ఆటో నుంచి దూకిన గోపి, తీవ్రగాయాలు.. ఎక్కడంటే..?

ఇంజెక్షన్ అంటే అంతా గజ్జున వణుకుతారు. అవును భయం లేకుండా ఎవరో కొందరు ఉంటారు. అలా ఓ యువకుడు కూడా భయపడ్డాడు. అంటే ఆటో దూకెంత ఫియర్‌కు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన చర్చకు దారితీసింది. సూది ఏందో కానీ.. అంతకుమించి గాయాలపాలయ్యాడు.

ఖమ్మం జిల్లాకు చెందిన గోపీ అనే యువకుడు ఈ పని చేశాడు. నేలకొండపల్లి మండలం అజయ్ తండాకు చెందిన బానోత్ గోపీ ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కాడు. ఆటోలో ఓ వ్యక్తి, వృద్ధుడు, బాలుడు ఉన్నారు. బాలుడు వెనుక సీటులో పడుకుని ఉన్నాడు. డ్రైవర్‌కి ఆటోలో ఉన్న వ్యక్తికి మధ్య సూది ఘటన గురించి చర్చ జరిగింది. దీంతో గోపీ భయపడిపోయాడు. వెంటనే ఆటో ఆపాలని కోరాడు. అయితే ఆటో ఆపలేదు. అలాగే ముందుకు పోనిచ్చాడు.

తనకు ఏదైనా జరుగుతుందా అని భావించాడు. గోపీలో మరింత భయం పెరిగింది. వెనుకున్న బాలుడిని సూది వేసి పడుకోబెట్టి ఉండొచ్చని అనుకున్నాడు. తనకు కూడా అదే చేస్తారేమోనని అనుమానించాడు. వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. వారు కచ్చితంగా తనకు సూది మందు వేస్తారని భయపడ్డాడు. దీంతో చేసేదేమీ లేక.. రన్నింగ్ ఆటో నుంచి బయటకు దూకేశాడు. అప్పటికే ఆటో స్పీడ్‌గా ఉంది. దీంతో గోపీకి తీవ్ర గాయాలయ్యాయి.

gopi jumps from running auto with injection fear

అతని భయమే శాపంగా మారింది. అనుమానంతో ఆటో నుంచి దూకేశాడు. దీంతో అతని చెంప, ముక్కుకు తీవ్ర గాయం అయ్యింది. భుజం, మోచేతి నుంచి కూడా పట్టి ఉంది. గోటితో పోయేది గొడ్డలి వరకు తీసుకురావడం అంటే ఇదేనెమో.. అవును అతను ఏదో ఊహించుకొని మరీ.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+