Khammam News: ఖమ్మం జిల్లాలో ఇంజక్షన్ హత్య.. ఆస్పత్రిలో ఉండగానే..

రాష్ట్రంలో సూది మందు కలకలం కొనసాగుతోంది. అదీ ఖమ్మం జిల్లాలోనే. గత ఆదివారం ఖమ్మం జిల్లా వలభి సమీపంలో ఓ వ్యక్తిని ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారు. అయితే ఈ కేసులు అసలైన నిందితురాలు మృతుడి భార్యగా పోలీసులు తేల్చారు. తాజాగా ఇదే జిల్లాలో ఇంజక్షన్ హత్య కలకలం సృష్టిస్తుంది.

రెండో పెళ్లి

రెండో పెళ్లి

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బొడ్రాయితండాకు చెందిన తేజావత్‌ భిక్షంకు విజయకుమారి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. విజయకుమారి పిల్లలు లేరని అదే జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన నవీనను రెండో పెళ్లి చేసుకున్నాడు. భిక్షం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఇద్దరు భార్యలతో నివాసముంటున్నారు.

జులై 30న

జులై 30న

నవీన 2020 జులై 4న ఆడ పిల్లకు జన్మించింది. 2022 జులై 30న ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత నవీనను వార్డులోకి తీసుకొచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. తెల్లవారేసరికి ఆమె చనిపోయింది. తన భార్య ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయిందంటూ భిక్షం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

 కాల్వొడ్డు వైకుంఠధామంలో

కాల్వొడ్డు వైకుంఠధామంలో


దీంతో ఆసుపత్రి యాజమాన్యం కొంత పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.ఆ తర్వాత నవీన మృతదేహానికి ఖమ్మం కాల్వొడ్డు వైకుంఠధామంలోనే అంత్యక్రియలు నిర్వహించాడు భిక్షం. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండి తెల్లవారే సరికి తల్లి చనిపోవడం పట్ల ఆస్పత్రి యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది.

సీసీటీవీ ఫుటేజీ

సీసీటీవీ ఫుటేజీ


వారం రోజుల తర్వాత వార్డులో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో భిక్షం నవీన చేయి పట్టుకోవడం, సూదిమందు గుచ్చుతున్నట్లు దృశ్యాలు కనిపించడంతో ఆస్పత్రి యాజమాన్యం ఏసీపీ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె భర్తపై తమకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మృతురాలి తల్లి ధర్మసోత్‌ లక్ష్మి ఈనెల 1న తన అల్లుడిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేసింది.

జులై 30న రాత్రి ఏం జరిగింది

జులై 30న రాత్రి ఏం జరిగింది

పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే సూదిమందు ఇచ్చి హతమార్చినట్లు భిక్షం ఒప్పుకోవడంతో 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జులై 30న రాత్రి పలుమార్లు భిక్షం భార్య ఉన్న వార్డులోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జులై 31న తెల్లవారుజామున తాను తెచ్చిన సూదిమందును నవీన కుడిచేతికి ఉన్న క్యాథలర్‌ ద్వారా ఎక్కించినట్లు భిక్షం ఒప్పుకున్నాడు.

పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు

పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు


ఈ కేసు విచారణలో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. 50 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే బంధువులకు అప్పగించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+