సింగరేణిని నష్టాల్లోకి నెట్టిందెవరు?: కాంగ్రెస్, బీజేపీపై కేసీఆర్ విమర్శలు
ఖమ్మం: కాంగ్రెస్ పాలకులు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదని, తెలంగాణ వచ్చిన ఆ ఉద్యోగులకు 3 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లుగా రెండు పార్టీలు చేసిందేమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యం, రవాణా, రోడ్లు, తాగునీరు, విద్యుత్ రంగంలో అభివృద్ధి జరుగుతోందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్ రూ. 11 వేల కోట్లు మాత్రమే ఉండేదన్నారు. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదన్నారు.

కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందన్నారు కేసీఆర్. ఈ నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చామన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాని పనులు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తయిందని వివరించారు. మళ్లీ వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తానే వచ్చి సీతారామా ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పారు.
సింగరేణి కథ మీకు తెలియాలి. తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు. ఈ సింగరేణి వందకు వందశాతం మనకే ఉండే.
— Telangana With KCR (@TSwithKCR) November 5, 2023
చేతకాని కాంగ్రెస్ నాయకుల వల్ల సింగరేణిలోని 49 శాతం వాటా కేంద్రానికి వెళ్ళింది.
- కొత్తగూడెం సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్#KCROnceAgain#VoteForCar pic.twitter.com/1V2rHVkVo2
ఎన్నికలు వస్తే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి తలెత్తుతోందని కేసీఆర్ అన్నారు. ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు బూతులు తిడుతున్నారని, అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలు చూసి ఓటేయాలన్నారు. అంతేగాక, అభ్యర్థి వెనుక పార్టీ ఉంటుందని, ఆ పార్టీ వైఖరి, చరిత్ర చూసి వారిని గెలిపించాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు కేసీఆర్.












Click it and Unblock the Notifications