కార్పొరేషన్ ఆఫీసులో టిక్‌టాక్.. వీడియోలతో ఉద్యోగులు బిజీ, మండిపడుతున్న నెటిజన్లు

ఖమ్మం : ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పని అంటే జనం బెంబేలెత్తిపోయారు. చెప్పిన పని చేయరని, తిప్పుకుంటారని వాపోతుంటారు. వాస్తవానికి వారిపై ఉన్న ఈ ముద్ర నిజమే. ఇదివరకు కార్యాలయాలకు రావడం, పనిచేయడం తక్కువే. కానీ పరిస్ధితి మారింది. అధికారులకు ఆఫీసులకు వస్తున్నారు. సాయంత్రం వరకు ఉంటున్నారు. కానీ పని మాత్రం చేయడం లేదు. ఏం చేస్తున్నారో తెలుసా..?

పని కాదు గురూ ..

పని కాదు గురూ ..

ఖమ్మం కార్పొరేషన్ .. ఎప్పుడూ బిజీ ఉంటుంది. ఆయా పనుల కోసం కాంట్రాక్టర్లు, ప్రజలు వస్తుంటారు. కానీ నగరపాలక ఉద్యోగులు మాత్రం వారి పని కాక .. తమ ఆనందాన్ని పొందుతారు. అందేటి పనిచేయడం లేదని అనుకుంటున్నారు. అవును ఉదయం వచ్చిన ఉద్యోగుల ఒకేచోట గుమిగుడుతున్నారు. వచ్చి కాసేపు పిచ్చపాటిగా మాట్లాడటం లేదు. టిక్ టాక్‌లో ముగినిపోతున్నారు. నలుగురు చేరి వీడియో చేస్తున్నారు. దీంతో నెటిజన్లు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అదేంటి కార్యాలయంలో వీడియోలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

వీడియోలు ..

వీడియోలు ..

ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు సరదాగా ఎంజాయ్ చేస్తుంటే .. మరికొందరు మాత్రం ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయాల్సింది పోయి .. వీడియోలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పనుల కోసం వచ్చే ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు టిక్ టాక్‌లో మునిగిపోవడం ఏంటి అని నిలదీస్తున్నారు. దీనిపై అన్నివర్గాల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు పని లేదా ? లేదంటే తాము చేసే పనిపై అంత నిర్లక్ష్యమా అని ప్రశ్నిస్తున్నారు.

 సర్వత్రా విమర్శలు ..

సర్వత్రా విమర్శలు ..

ఖమ్మం ఉద్యోగుల టిక్ టాక్ వీడియోలపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. కానీ వారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందరో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వస్తారని .. వారికి సర్టిఫికెట్లు అందించాల్సి పోయి ... వీడియోల్లో మునిగితేలడం ఏంటని మండిపడుతున్నారు. అధికారుల వీడియోలపై నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. ఇది సరికాదని సూచిస్తున్నారు. టిక్ టాక్ చేయాలంటే .. ఆఫీసు సమయం అయిపోయాకే, సెలవు రోజు చేయాలి గానీ .. విధి నిర్వహణలో ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+