రేణుకా చౌదరికి షాక్: చీటింగ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఖమ్మం: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. శుక్రవారం ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది.
తన భర్త రాంజీ నాయక్‌కు 2014 ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ రేణుక చౌదరి మోసగించారని, తమ వద్ద రూ. కోటి 30లక్షలు తీసుకున్నారని కళావతి బాయి అనే మహిళ ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల సమయంలో ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

కళావతి ఫిర్యాదు మేరకు రేణుకా చౌదరిపై సెక్షన్ 420, 417 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విచారణలో భాగంగా రేణుకకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు తీసుకోకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Telangana: Non-bailable warrant issued against Congress leader Renuka Chowdhury in connection with a 4-year-old cheating case registered in Khammam. pic.twitter.com/TtqnYR9HjA
— ANI (@ANI) August 30, 2019
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications