ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శభాష్ సలీమా: తెలంగాణ తొలి మహిళ ఐపీఎస్.. వావ్ అంటోన్న నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

మహిళలు సత్తా చాటడం కాస్త గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అవును వెనకబడిన, బలహీన వర్గాలు,, మైనార్టీకి చెందిన అతివలు కొలువు కొడితే ఆ కిక్కే వేరు. ఇప్పుడు తెలంగాణలో ఓ ముస్లిం మహిళ ఐపీఎస్ కొట్టి.. మిగతావారికి ఆదర్శంగా నిలిచింది. ఐఏఎస్, ఐసీఎస్‌గానే కాకుండా దేశ రక్షణ వ్యవస్థలో గల త్రివిధ దళాల్లో కూడా వారు రాణిస్తున్నారు. ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. సంప్రదాయాల ముసుగులో బయటకు పెద్దగా రాని ముస్లిం మహిళలు కూడా ఉండటం సంతోషించాల్సిన విషయం.

తొలి ఐపీఎస్..

తొలి ఐపీఎస్..

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ముస్లిం మహిళ ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన షేక్‌ సలీమా రాష్ట్రంలోనే తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా రికార్డులకెక్కారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నాన్‌ కేడర్‌ ఐపీఎస్‌ ప్రమోషన్ల లిస్టులో షేక్ సలీమా స్థానం దక్కించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన సలీమా కాకతీయ వర్సిటీ నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు.

 ఎస్సై కూతురు

ఎస్సై కూతురు

సలీమా తండ్రి లాల్ బహదూర్ ఖమ్మం జిల్లాలో SIగా పనిచేసి రిటైర్ అయ్యారు. సలీమా 2007లో గ్రూప్‌-1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్‌ పొందారు. అంబర్‌పేట పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌గాను, మాదాపూర్‌లో అదనపు కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సలీమా కుటుంబంలో అందరు చదువుకున్నవారే. దీంతో స్వతహాగానే సలీమాకు చదువు అంటే ఇష్టం..తండ్రి పోలీస్ కావటంతో ఉన్నతస్థాయి పోలీసు కావాలనే లక్ష్యంతో సలీమా చదువు సాగింది.

 ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం


సలీమాకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు. సలీమా సోదరి జరీనా ఇటీవల ఏపీలో గ్రూప్‌-1 పరీక్ష రాసి మెయిన్స్‌కు సెలక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తే సలీమా సోదరి కూడా ప్రభుత్వ ఉద్యోగి అవుతారు. సలీమా మరో చెల్లెలు మున్నీ కూడా ఉద్యోగే. ఖైరతాబాద్‌ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిం హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌‌గా పనిచేస్తారు. సలీమా భర్త కూడా సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్.. ఇలా సలీమా కుటుంబం అంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే ఉన్నారు.

English summary
sheikh salima is the first muslim woman ips officer in telangana state. she is belongs to kammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X