వందే భారత్ మళ్లీ డ్యామేజ్- ఖమ్మంలో ప్రమాదానికి గురైన ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు చిన్న చిన్న ప్రమాదాలు తప్పట్లేదు. ఇదివరకు గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించినట్టే- ఖమ్మంలో ఈ రైలు ఎద్దును ఢీ కొట్టింది.

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు చిన్న చిన్న ప్రమాదాలు తప్పట్లేదు. ఇదివరకు గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఈ రైలు ప్రమాదాల బారిన పడింది. తాజాగా ఖమ్మంలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైలు ముందు భాగం డ్యామేజ్ అయింది. నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.

ఇదివరకు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గుజరాత్ లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గుజరాత్‌ లోని వట్వ-మణినగర్ స్టేషన్ల మధ్య ఈ ఉదయం 11:20 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టాలపైకి వచ్చిన పశువుల మందను ఢీకొట్టిందీ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్. దీనితో ముందు రైలు ముందుభాగం దెబ్బతిన్నది. కుడి భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ముందుభాగం మొత్తం ఊడి చేతికొచ్చింది. వేగంగా ఢీ కొట్టడంతో పెద్దగా కుదుపులకు లోనైంది రైలు. భారీగా శబ్దం చేస్తూ నిలిచిపోయింది.

Vande Bharat

ఇప్పుడు తాజాగా అలాంటి ఉదంతమే ఖమ్మం జిల్లాలో సంభవించింది. వందే భారత్‌ రైలును మరోసారి ఎద్దు ఢీకొట్టింది. జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తోన్న ఈ ఎక్స్ ప్రెస్.. పట్టాల మీదికి వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. దీనితో రైలు ముందు భాగం దెబ్బతిన్నది. కొన్ని నిమిషాల పాటు రైలును అక్కడే నిలిపివేశారు అధికారులు.

Vande Bharat

రైల్వే సిబ్బందిని సంఘటన స్థలానికి రప్పించారు. మరమ్మతులు చేపట్టారు. మరమ్మతు పనులు పూర్తయిన తరువాత విశాఖపట్నానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ ఎక్స్ ప్రెస్- రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకోవాల్సి ఉంది. మరమ్మతు పనుల వల్ల జాప్యం చోటు చేసుకుందని అధికారులు వివరించారు.

Vande Bharat

ఇదే రైలుపై రాళ్లు కూడా విసిరిన సంఘటన ఖమ్మం జిల్లాలోనే జరిగిన విషయం తెలిసిందే. పందిల్లపల్లి స్టేషన్ కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక కోచ్ కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బంది- సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+