ఎన్నికల వేళ.. కుప్పంపై కేంద్రం వరాలు
Amrit Bharat Stations: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రైలు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తక్షణ చర్యలు చేపట్టింది. ఏపీ, కర్ణాటకల్లో మొత్తం 15 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది.
అత్యంత రద్దీగా ఉండే బెంగళూరు డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు అవన్నీ. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం స్టేషన్లు కూడా ఈ డివిజన్ కిందికే వస్తాయి. వాటిన్నింటినీ 372.13 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనుంది రైల్వే మంత్రిత్వ శాఖ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే.. కొత్తగా నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ.. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న నైరుతి రైల్వే అధికారులు పూర్తి చేస్తోన్నారు.
బెంగళూరు డివిజన్ పరిధిలోకి వచ్చే బంగార్‌పేట, చెన్నపట్టణ, ధర్మపురి, దొడ్డబళ్లాపుర, హిందూపురం, హోసూరు, కెంగేరి, కృష్ణరాజపురం, కుప్పం, మల్లేశ్వరం, మాలూరు, మండ్య, రామనగర, తుంకూరు, వైట్ ఫీల్డ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయనుంది.
చెన్నపట్టణ-శెట్టిహళ్లి, చిన్నకొత్తపల్లి-మక్కాజీ పల్లి-నాగసముద్రం స్టేషన్ల మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి, బెంగళూరు ఈస్ట్ స్టేషన్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ మేరకు నైరుతి రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications