కుప్పంలో వైసీపీ బంద్- అన్న క్యాంటీన్ కూల్చివేత-రోడ్డుపైనే కూర్చుని చంద్రబాబు నిరసన
కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన ఉద్రిక్తతల మధ్యే కొనసాగుతోంది. రెండో రోజు టూర్ లో భాగంగా కుప్పంలో చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీ నేతలు కూల్చివేశారు. వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా కార్యకర్తలు దీన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కాన్వాయ్ ను అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు కాలినడకనే అన్న క్యాంటీన్ కు బయలుదేరి వెళ్లారు.
చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ కుప్పం బంద్ కు పిలుపునిచ్చింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు. అలాగే ప్యాలెస్ రోడ్డులో ఉన్న టీడీపీ బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేశారు. దీంతో కుప్పంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.

కుప్పంలో చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోతున్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ అన్న క్యాంటీన్ కు కాలి నడకనే బయలుదేరిన చంద్రబాబు.. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబును అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కుప్పంలో వైసీపీ బంద్- అన్న క్యాంటీన్ కూల్చివేత-రోడ్డుపైనే కూర్చుని చంద్రబాబు నిరసన#andhrapradesh, #kuppam, #chandrababu pic.twitter.com/3JhqvLqd6L
— oneindiatelugu (@oneindiatelugu) August 25, 2022












Click it and Unblock the Notifications