ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఎమ్మిగ‌నూరు మండ‌లం మొత్తంగా...ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుండి గోనిగండ్ల మండ‌లం ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో చేరింది. మాజీ ముఖ్య‌మంత్రులు దామోద‌రం సంజీవ‌య్య‌, కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి లు ఇక్క‌డి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వ‌హించారు. టిడిపి సీనియ‌ర్ నేత రాజ‌కీయ జ్యోతిష్యుడిగా పేరున్న బివి మోహ‌న‌రెడ్డి ఇక్క‌డి నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..మూడు సార్లు ఓడిపోయా రు. కాంగ్రెస్ నేత చెన్న‌కేశ‌వ రెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ నుండి ఒక సారి వైసిపి నుండి గెలుపొందారు. కాంగ్రెస్ నుండి రెండు సార్లు మోహ‌న‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. బివి మోహ‌న‌రెడ్డి ఎన్టీఆర్ క్యాబి నెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు ఇక్క‌డి నుండి పోటీ చేసారు.

15 సార్లు ఎన్నిక‌లు..టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్యే పోటీ..
ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి ఆరు సార్లు, వైసిపి ఒక్క‌సారి, స్వ‌తంత్ర పార్టీ ఒక్క‌సారి గెలుపొందాయి. 1994, 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన చెన్న‌కేశ‌వ రెడ్డి ఆ రెండు సార్లు బివి మోహ‌న‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి, 2004,2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో తిరిగి 2012 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన చెన్న‌కేశ‌వ రెడ్డి..ఈ మూడు సార్లు బివి మోహ‌న‌రెడ్డి పై విజ‌యం సాధించారు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన ల‌క్ష్మీకాంత రెడ్డికి 16638 ఓట్లు వ‌చ్చాయి. ఇక్క‌డ 2009 వ‌ర‌కు కాంగ్రెస్ - టిడిపి మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉండ‌గా, ఆ త‌రువాత టిడిపి - వైసిపి మ‌ధ్య పోటీగా మారింది. 2012 లో కాంగ్రెస్ స‌భ్యుడిగా ఉంటూ వైసిపి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డి శాన‌స స‌భ్య త్వాన్ని కోల్పోయిన చెన్న‌కేశ‌వ రెడ్డి అప్ప‌టి నుండి వైసిపి లో కొన‌సాగుతున్నారు.

#AndhraPradeshElections2019: All about Yemmiganur Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 228088 ఓట‌ర్లు ఉండ‌గా, అందులో 165775 మంది ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. టిడిపి నుండి పోటీ చేసిన బి జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డికి 84433 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి కి 70122 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ది జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డి 14361 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డి టిడిపి నుండి అసెంబ్లీలో మంచి వ‌క్త‌గా నిలిచారు. జిల్లాలోనూ టిడిపి ప‌ట్ల అంకిత భావంతో ఉన్న నేత‌గా పేరుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+