వైఎస్ జగన్‌కు మెగాస్టార్ థ్యాంక్స్: చరిత్ర గుర్తించని పోరాట యోధుడు: నా అదృష్టం..గౌరవం

కర్నూలు: టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఉన్న గౌరవాభిమానాలను మరోసారి చాటుకున్నారు. ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో సినిమా షూటింగులను నిర్వహించడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిన సమయంలో ఆయనను కలిసి కృతజ్ఙతలు తెలుపుకొన్న చిరంజీవి.. మరోసారి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు.

కర్నూలు శివార్లలోని ఓర్వకల్‌లో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టడాన్ని చిరంజీవి స్వాగతించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టినందుకు వైఎస్ జగన్‌కు కృతజ్ఙతలు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి.. చరిత్ర గుర్తించని ఓ పోరాట యోధుడని, ఓ గొప్ప దేశభక్తుడని మెగాస్టార్ చెప్పారు. అలాంటి సమర యోధుడి పేరు కర్నూలు విమానాశ్రయానికి పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు.

Chiranjeevi thanks to CM Jagan for naming Kurnool airport with Uyyalavada Narasimha Reddy

అలాంటి మహా యోధుడి పాత్రను తాను తెర మీద పోషించానని చిరంజీవి చెప్పారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రను పోషించడం తనకు మాత్రమే దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి.. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఇదివరకు సైరా నరసింహా రెడ్డి పేరుతో చిరంజీవి.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్‌ను పోషించారు.

న్యాయ రాజధానిగా అభివృద్ధి రూపాంతరం చెందబోతోన్న కర్నూలు శివార్లలోని ఓర్వకల్‌లో నిర్మించిన విమానాశ్రయాన్ని వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం ప్రారంభించిన విషయం తెలిసిందే. 28వ తేదీ నుంచి విమాన సర్వీసుల రాకపోకలు ఆరంభమౌతాయి. దీనికి సంబంధించిన టికెట్లు బుకింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కర్నూలుజిల్లాకే చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరును ఈ విమానాశ్రయానికి పెట్టబోతున్నామని వైఎస్ జగన్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+