అనుమానం పెనుభూతమై... పిల్లల్ని అడవిలో వదిలేశాడు??
సప్తవ్యసనాల్లో మద్యం సేవించడం ఒకటి. అది తీసుకుంటే మత్తులో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. ఈ వ్యవసనానికి తోడు భార్య మీద అనుమానం కూడా తోడైంది. దీంతో అతను ఆ మత్తులో తన ఇద్దరు పిల్లలను మృత్యుముఖంలోకి తీసుకువెళ్లాడు. అదృష్టం బాగుండి స్థానికుల సహకారంతో ఆ పిల్లలు తృటిలో తప్పించుకున్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన యోగేష్ తన భార్య సుజాతపై అనుమానంతో ఈ ఘటనకు ఒడిగట్టాడు. అనుమానం ఉంటే పెద్దలతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసే దుస్సాహసానికి ఒడిగట్టాడు. పిల్లలిద్దరిని ఆటోలో ఎక్కించుకొని ప్యాలకుర్తి సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లాడు. ఆటో వేగాన్ని పెంచి వేగంగా పిల్లలతో సహా కాలవలోకి వదిలేసి తాను ఆటో నుంచి దూకేశాడు. అయితే అదృష్టం బాగుండి ఆటో కాల్వ పక్కన ఉన్న ఒక సిమెంటు దిమ్మెను ఢీకొని ఆగిపోయింది. కాల్వలో పడిపోయిన చిన్నారులు పెద్దగా ఏడుస్తుండటంతో వాటిని విన్న రైతులు, స్థానికులు అప్రమత్తమై అక్కడికి చేరుకొని వారిని రక్షించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారు అక్కడకు చేరుకొని వివరాలను సేకరించారు. ఆ చిన్నారుల తండ్రి యోగేష్‌పై కేసు నమోదుచేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు ఒడిగట్టిన వ్యక్తిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications