లోకేష్‌ను సెంటిమెంట్‌తో బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే- బయటపడేదెలా..!!
కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 93వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కర్నూలులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు హఫీజ్ ఖాన్‌పై ఆయన ఘాటు విమర్శలు సంధించారు. భూకబ్జా ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున భూములను ఆక్రమించారంటూ నారా లోకేష్ ఆరోపించారు.
దీనిపై హఫీజ్ ఖాన్ అంతే ఘాటుగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్‌పై ప్రమాణం చేస్తానని అన్నారు. స్థానిక మసీదులో తనతో చర్చకు రావాలంటూ ఆయన నారా లోకేష్‌కు సవాల్ విసిరారు. ఖురాన్ చేత పట్టుకుని ఆయన మసీదు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన కారు ఎక్కుతూ మీసం మెలేశారు.

ఆ సమయంలో ఆయన వెంట పెద్ద ఎత్తున అనుచరులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హఫీజ్ ఖాన్ అనుచరులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అప్పటికప్పుడు ప్రదర్శనగా బయలుదేరడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తన రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీ అకారణంగా అరోపణలు చేస్తోందంటూ హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై చర్చకు ఇప్పటికిప్పుడు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. లోకేష్ వచ్చేంత వరకూ తాను మసీదులోనే ఉంటానని తేల్చి చెప్పారు. తాను వెళ్లిన ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం నారా లోకేష్‌కు ఆనవాయితీగా మారిందని విమర్శించారు.
లోకేష్‌ను సెంటిమెంట్‌తో బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే- బయటపడేదెలా..!!#HafeezKhan #NaraLokesh #YuvaGalamPadayatra #AndhraPradesh #APPolitics #Oneindiatelugu pic.twitter.com/5iuVXR5J2X
— oneindiatelugu (@oneindiatelugu) May 8, 2023
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని యువనేత నారా లోకేష్ ఇవాళ హామీ ఇచ్చారు. కర్నూల్లో జరుగుతున్నయువగళం పాదయాత్రలో భాగంగా హాజరైన ప్రజలకు లోకేష్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు హైకోర్టు తీసుకొస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. దీంతో ఇప్పుడు లోకేష్.. హైకోర్టు బెంచ్ తెస్తామని హామీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications