కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ హయాంలో పెరిగిన నిరుద్యోగం: కోట్ల విసుర్లు

|
Google Oneindia TeluguNews

నిరుద్యోగ అంశం హాట్ టాపిక్ అవుతోంది. కొలువులు మేం ఇచ్చామని అంటే.. మేం భర్తీ చేశాం అని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను.. పూర్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు పెండింగ్‌లో పెట్టిందని ప్రశ్నించారు. రైతులు పండించే పంటకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 15 తర్వాత నీళ్లు బంద్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పూర్తి చేయడం లేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు.

వైసీపీ గురించి కోట్ల ఇలా కామెంట్ చేస్తే.. అధికార పార్టీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇటు వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అయితే తన తండ్రి వైఎస్ హయాంలో కొలువులు భర్తీ చేశామని చెబుతున్నారు. ఐదేళ్లలో నిరుద్యోగుల కోసం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. ప్రైవేటు రంగంలో 11 లక్షల ఉద్యోగాలను సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించారని వివరించారు. తెలంగాణలో లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారని అడిగారు. 80 వేల ఉద్యోగాలు ఏమిటి..? పీఆర్సీ ప్రకారం 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పీఆర్సీ ప్రకారం లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది.

unemployement increase in ysrcp period

Recommended Video

Anthrax కలకలం... కరోనా లా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం | Telangana || Oneindia Telugu

వైఎస్ఆర్ ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి 2004, 2006, 2008 మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఒకేసారి 58 వేల టీచర్ ఉద్యోగాలు, జంబో నోటిఫికేషన్ కింద ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చిన నాయకుడు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు. ప్రైవేటు రంగంలో కూడా 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. కార్పొరేషన్ లోన్ల ద్వారా లక్షల పేద పిల్లలకు స్వయం ఉపాది కల్పించి వాళ్ల కాళ్ల మీద వాల్లు నిలబడేలా చూశాడు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేయడం లేదు కేసీఆర్ అని అడిగారు.

English summary
unemployement increase in ysrcp period tdp leader kotla surya prakash reddy alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X