ఎల్వీ ప్రసాద్ అత్యుత్తమ కంటి వైద్య సేవలు... ఆ మూడు విలువలతో ముందుకు సాగుతూ...

హైదరాబాద్‌లో 34 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి(LVPEI) ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ అగ్రభాగాన నిలుస్తోంది. ఎన్నో రకాల కంటి సమస్యలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఎంతో కీర్తి గడించింది.

హైదరాబాద్‌లో 1987లో తమ మొదటి కంటి ఆస్పత్రిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎల్వీ ప్రసాద్ సంస్థ ప్రధానంగా మూడు విలువలను అనుసరిస్తూ పనిచేస్తోంది. ఇందులో 'సమానత్వం,సమర్థత,శ్రేష్ఠత'(EEE-Equity,Efficiancy,Excellence) అనే విలువలు ఉన్నాయి. ఇక్కడ పేద,ధనిక అన్న తేడా లేకుండా పేషెంట్లందరినీ సమానత్వ భావంతో చూస్తారు. సమర్థత విషయానికొస్తే... అత్యుత్తమ వైద్య పరికరాలు,అధునాతన టెక్నాలజీతో కూడిన ఉత్తమ వైద్య సేవలు ఇక్కడ అందుతాయి. ఇక తెలంగాణతో పాటు,ఆంధ్రప్రదేశ్,కర్ణాటకల్లోని తమ బ్రాంచిలన్నింటిల్లో శ్రేష్ఠమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యంగా ఎల్వీ ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది.

LV Prasad hospital provides excellent, equitable eye care systems to all those in need

పేదలకు,మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఎల్వీ ఆస్పత్రి యాజమాన్యం కృషి చేస్తోంది. దాదాపు 50శాతం మంది పేషెంట్లకు అన్ని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్లలో నాన్-పేయింగ్ కేటగిరీల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. కంటిశుక్లం నుండి క్యాన్సర్ వరకు 50శాతం మంది పేషెంట్లకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటకల్లోని 4 తృతీయ, 20 ద్వితీయ, 200 పైచిలుకు విజన్ సెంటర్లలో నాన్ పేయింగ్ విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అంకితభావం గల వైద్యులు,సిబ్బంది కారణంగా ఇప్పటివరకూ ఎన్నో వేలమంది తమ కంటిచూపును తిరిగి పొందారు.

కోవిడ్ 19 కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి కార్యాచరణ :

లాభాపేక్ష లేకుండా 50శాతం మంది నిరుపేదలకు ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యులు,సిబ్బంది అత్యంత అంకితభావంతో,సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్నారు.

సర్జికల్ కేర్‌తో పాటు ఎమర్జెన్సీ కేర్‌ అందుబాటులో ఉంది.

ఇంటి నుంచే వైద్య సలహాలు పొందేందుకు టెలీకన్సల్టేషన్ సదుపాయం అందుబాటులో ఉంది.

తక్కువ ధరలో, OS విజర్స్ (ప్రొటెక్టివ్ ఫేస్-గేర్) & వెంటిలేటర్ సౌకర్యం

దృష్టి లోపం మరియు అంధత్వం ఉన్నవారికి పునరావాస సంరక్షణ

నగరాల్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన చిన్నారులకు కంటి పరీక్షలు

2900 మంది సిబ్బందితో నిరంతర వైద్య సేవలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+