మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శభాష్ పాలమూరు అతివ: గిన్సిస్ బుక్‌లో చోటు, గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు అంకితం

|
Google Oneindia TeluguNews

పాలమూరు మహిళలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. 10 రోజుల్లో 2.08 కోట్ల విత్తన బంతులు తయారు చేశారు. మహబూబ్ నగర్ రైల్వే కమ్యూనిటీ హాల్ లో గిన్నిస్ వర్దల్డ్ రికార్డ్ అటెంప్ట్, లార్జెస్ట్ సీడ్ బాల్ సెంటెన్స్ కార్యక్రమం జరిగింది. పరిశీలించి.. గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు కల్పిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి రిషి నాధ్ అధికారికంగా ప్రకటించారు. 24 వేలమంది మహిళలు పది రోజుల్లో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ ఘనత సాధించిన మహిళలకు వివిధ పార్టీల నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు.

గిన్నిస్ రికార్డు

గిన్నిస్ రికార్డు


గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు మహబూబ్ నగర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ వేదికగా నిలిచింది. జిల్లాకు చెందిన మహిళ సమాఖ్య ప్రతినిధులు 10 రోజుల్లో2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి.. వాటిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్‌లో గల మైదాన ప్రాంతాల్లో వేద జల్లే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

2 కోట్ల సీడ్ బాల్స్

2 కోట్ల సీడ్ బాల్స్

భారీగా విత్తన బంతులను తయారు చేసి వాటిని విజయవంతం గా వెదజెల్లి.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గా నమోదు అయ్యింది. చారిత్రాత్మక ఘట్టానికి కృషి చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం , పీజెడ్ఎంఎస్, డిఆర్ డిఏ, మెప్మా, హెటెరో గ్రూప్, జిల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బృందానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

అంకితం

అంకితం


ఊహించని విధంగా విత్తన బంతులను తయారు చేసి వాటిని విజయవంతంగా వెదజల్లి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారని.. ఈ రికార్డ్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం ఇస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
palamuru women places in the guinness book world record. they form 2 crore seed balls with 10 days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X