ఎన్నికల వేళ- తెలంగాణపై రూ.వేల కోట్లను గుమ్మరించిన కేంద్రం..
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది.

ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆయన టూర్ ఖరారైంది. తన పర్యటనలో భాగంగా మోదీ 13,500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
భారత్‌మాలలో భాగంగా నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించ తలపెట్టిన ఎకనామిక్ కారిడార్‌లో భాగమైన రోడ్డు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ రహదారి 163జీలో వరంగల్ నుంచి ఖమ్మం వరకు 108 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి విజయవాడ వరకు 90 కిలోమీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్ హైవే ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.
మొత్తం 6,400 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది కేంద్రం. జాతీయ రహదారి 365బీబీలో భాగంగా సూర్యాపేట్ నుండి ఖమ్మం సెక్షన్ మధ్య 59 కిలోమీటర్ల పొడవైన రహదారిని మోదీ జాతికి అంకితం చేస్తారు. దాదాపు 2,460 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇది.

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కారిడార్‌లో భాగంగా ఇది నిర్మితమైంది. ఖమ్మం జిల్లా, ఏపీలోని కోస్తా ప్రాంతాలకు మరింత మెరుగైన కనెక్టివిటీని అందించడానికి దీన్ని చేపట్టింది కేంద్రం. జక్లయిర్-కృష్ణా కొత్త రైల్వే లైన్‌ను కూడా మోదీ అంకితం చేయనున్నారు. కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ - రాయచూర్ రైలు సర్వీసును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఈ రైలు.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలను కర్ణాటకలోని రాయచూర్ జిల్లాతో అనుసంధానిస్తుంది. అదే సమయంలో హాసన్-చర్లపల్లి ఎల్‌పిజి పైప్‌లైన్ ప్రాజెక్టును మోదీ జాతికి అంకితం చేస్తారు. కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మల్టీ-ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేస్తారు.
1,940 కోట్ల రూపాయలతో 425 కిలోమీటర్ల పొడవున ఈ పైప్‌లైన్ నిర్మితం కానుంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్ -3, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications